సరిగ్గా మే 30 వ తారీకు కి జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఏడాదయ్యింది. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, మద్దతుదారులు జగన్ కి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మరోపక్క ప్రతి శాఖతో ‘మన పాలన మీ సూచన’ కార్యక్రమం పేరిట ప్రతి ఒక్కరి దగ్గర సూచనలు తీసుకుంటూ ఏ విధంగా శాఖ కార్యక్రమాలు జరుగుతున్నాయో స్వయంగా లబ్ధిదారులను అడిగి తెలుసుకుంటున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని విధంగా నేరుగా ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వుతూ జగన్ తీసుకుంటున్న సూచనలను చూసి చాలా మంది మేధావులు ఆశ్చర్యపోతున్నారు.

IHG

ఇదిలా ఉండగా జగన్ ముఖ్యమంత్రిగా అడుగుపెట్టిన టైములో ఏపీ ఖజానాలో చిల్లిగవ్వ లేదు. పైగా గత ప్రభుత్వం మొత్తం అప్పులు పాలు చేసి వెళ్ళింది. అయినా కానీ ప్రస్తుతం రాష్ట్రంలో ఇచ్చిన హామీల విషయంలో గాని అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలను కానీ ఎక్కడ జాప్యం కాకుండా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా కరోనా వంటి కష్టకాలంలో కూడా ఎక్కడ సంక్షేమ కార్యక్రమాలు పింఛన్లు రేషన్ ఆగిపోకుండా జగన్ చేస్తున్న కార్యక్రమాలకు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్ధిక నిపుణులే ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి అప్పులు రాష్ట్రం అన్యాయమైన విభజనతో నష్టపోయిన రాష్ట్రంలో ఇది ఎలా సాధ్యం అని అంటున్నారు. ఇక్కడ ఒక విషయం గమనిస్తే గత ప్రభుత్వం మాదిరిగా పబ్లిసిటీ లకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టకుండా ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలు కూడా హంగు ఆర్భాటాలు లేకుండా జగన్ చేసేస్తున్నారు.

IHG

ఇలా ప్రభుత్వ పరంగా పబ్లిసిటీ పరంగా తక్కువ ఖర్చు చేస్తూ సంక్షేమ కార్యక్రమాలకు ఎక్కడ కోత పడకుండా పరిపాలన చేస్తున్నారు. విభజనతో నష్టపోయి కనీసం ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో అప్పట్లో ఉన్నది రాష్ట్ర ఖజానా పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఉన్న రాష్ట్రం లో జగన్ చేస్తున్న పరిపాలన దేశంలో ఉన్న మహా మహా ఆర్థిక నిపుణులకే మతి పోతున్నది. అంతే కాకుండా జాతీయ స్థాయిలో ఉన్న రాజకీయ నాయకులు జగన్ కి ఉన్న ముందు చూపు దేశంలో ఉన్న ఏ ముఖ్యమంత్రి కి లేదని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ విధంగా ఖాళీ  ఖజానా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన జగన్ రాష్ట్రంలో ఉన్న ప్రతి కన్నీరును తుడిచే విధంగా పరిపాలన అందిస్తున్నట్లు మేధావులు అంటున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: