పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిల్చిపోయేలా ముద్రవేసుకున్న దివంగత వైఎస్సార్ మరణం తర్వాత ఏపీ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయో అందరికీ తెలిసిందే. వైఎస్సార్ తనయుడైన జగన్, కాంగ్రెస్‌తో విభేదించి బయటకొచ్చి వైఎస్సార్సీపీ పెట్టిన విషయం తెలిసిందే. ఇక ఆ వెంటనే ఆయన అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్ళడం జరిగింది. టీడీపీ, కాంగ్రెస్ నేతలు కేసులు వేయడంతో, దానిపై విచారణ జరిగి జగన్ 16 నెలల పాటు జైలు జీవితం గడిపారు.

 

అయితే ఆయన జైలులో ఉన్నప్పుడూ జరిగిన ఉపఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. ఇక ఆ ప్రభంజనం తర్వాత జగన్ జైలు నుంచి వచ్చారు. ఈ క్రమంలోనే ఏపీ, తెలంగాణలు విడిపోయాయి. ఆ వెంటనే జరిగిన 2014 ఎన్నికల్లో ఏపీలో టీడీపీ అధికారంలోకి వస్తే, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. అయితే జగన్ తొలిసారి ఎన్నికల బరిలో దిగి 67 సీట్లు దక్కించుకున్నారు. ఇక కాంగ్రెస్ పరిస్తితి ఏపీలో దారుణమైపోయింది. తెలంగాణలో ఏదో అలా అలా ఉంది. కేంద్రంలో కూడా సోనియా గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది.

 

అంటే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చిన దగ్గర నుంచి సోనియా గాంధీ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడింది. 2019 ఎన్నికల్లో అయితే ఆ పరిస్తితి మరి దారుణమైంది. ఇటు చంద్రబాబు పరిస్తితి కూడా దారుణంగా అయిపోయింది. ఏదో అనుభవం ఉందని 2014లో అధికారంలోకి వచ్చినా, ఆ అనుభవం దోచుకోవడానికే అని ప్రజలకు అర్ధమయ్యి జగన్‌ని గెలిపించుకున్నారు. కాకపోతే చంద్రబాబు ఘోర ఓటమి పాలయ్యారు. ఇక ఆయన వయసు కూడా మీద పడటం, జగన్‌కు ప్రజల్లో ఇంకా క్రేజ్ ఉండటంతో బాబు రాజకీయ భవిష్యత్ కూడా ముగింపు దశకు వచ్చినట్లే కనిపిస్తోంది.

 

ఇదే విషయాన్ని డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా చెబుతున్నారు. జగన్ మోహన్ రెడ్డిని జైల్లో పెట్టించిన సోనియా, చంద్రబాబు రాజకీయ భవిష్యత్తు ఏవిధంగా మారిందో అందరూ చూస్తున్నారని మాట్లాడారు. అంటే జగన్‌తో పెట్టుకున్నాకే సోనియా, చంద్రబాబు రాజకీయ భవిష్యత్ జీరో అయిపోయిందనే ఉద్దేశంతో నారాయణ మాట్లాడారు. మరి చూడాలి భవిష్యత్‌లో సోనియా, చంద్రబాబులు పుంజుకుంటారో లేక ఇంకా కనుమరుగైపోతారో. 

మరింత సమాచారం తెలుసుకోండి: