లాక్‌డౌన్‌ సడలింపులతో నిత్యావసర సరుకుల కొనుగోళ్లు పెరిగాయ్. రవాణా సౌకర్యం పూర్తిస్థాయిలో లేకపోవడంతో ధరలు సామాన్యులకు దడ పుట్టిస్తున్నాయి. పెరిగిన ధరలు సామాన్యులకు మరింత భారంగా మారాయి. ఇంకా ముందుముందు ఏ స్థాయిలో రేట్లు పెరిగిపోతాయోననే భయం పట్టుకుంది. అయితే...లాక్‌డౌన్‌ సడలింపులతో ప్రస్తుతం సాధారణ ధరలకే అమ్మకాలు జరపలానే డిమాండ్ ఊపందుకుంది. లాక్‌డౌన్‌పై ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

 

లాక్‌డౌన్‌తో ఆంధ్రప్రదేశ్ లో ఉండే పలు నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దాదాపు రెండు నెలలు పాటు నిత్యావసర వస్తువులకు అవస్థలు తప్పలేదు. రెట్టింపు ధరలతో వ్యాపారులు సామాన్యులకు చుక్కలు చూపించారు. ఒక్కో వస్తువు మీద 30 నుంచి 40 శాతం అధిక ధరలకు అమ్మారు. పెరిగిన ధరలతో సామాన్యుడు అల్లాడిపోయాడు. కొన్ని సందర్భాల్లో అవసరమైన దాని కంటే కూడా తక్కువ పరిమాణాల్లోనే కొనుగోలు చేసుకుంటూ వచ్చారు. 

 

అయితే...ఏపీ ప్రభుత్వం లాక్‌డౌన్‌కు సడలింపులు ఇచ్చింది. ప్రస్తుతం అన్ని రకాల సరుకుల అమ్మకాలకు అనుమతులు ఉన్నాయి. వినియోగదారులతో కిరాణా షాపులు కళకళలాడుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలోనే 50 శాతం అమ్మకాలు పెరిగాయని వ్యాపారులు చెపుతున్నారు. ఐతే...లాక్‌డౌన్ కారణంగా బిజినెస్ చాలా వరకు నష్టపోయామని తెలిపారు. 

 

ఇక...రంగా మారాయి. ఇప్పటికే లాక్‌డౌన్‌తో ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి మధ్యతరగతి కుటుంబాలు. ధరలు పెరగటం అందరినీ మరింత కలవరానికి గురి చేస్తోంది. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతుండటంతో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అయిపోయారు. బయటకు రాకపోకలు తగ్గిపోయాయి. రెండు నెలల పాటు ఇంట్లోనే ఉండాల్సి వస్తుందని ఊహించలేకపోయారు నగర వాసులు. నిత్యావసర వస్తువులు దొరకకుండా పోతాయేమోనని ప్రజలకు భయం పట్టుకుంది. దీంతో ముందు జాగ్రత్తగా అవసరమైన అన్ని వస్తువులను కొనిపెట్టుకునేందుకు ప్రయత్నించారు. ఫలితంగా గతంలో ఎన్నడు లేనంత రీతిలో లాక్‌డౌన్‌ టైమ్‌లో అమ్మకాలు పెరిగాయి.  

 

మొత్తానికి...రవాణా సౌకర్యాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే తప్పా నిత్యావసర సరుకుల ధరలు తగ్గే అవకాశం కనిపించటం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: