నిన్నటి నుంచి తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టు నిమ్మగడ్డ కేసు విషయంలో ఇచ్చిన తీర్పు గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. కోర్టు జగన్ సర్కార్ ఇచ్చిన ఆర్డినెన్స్ ను రద్దు చేయడంతో పాటు నిమ్మగడ్డ రమేశ్ తిరిగి ఎన్నికల కమిషనర్ గా కొనసాగాలని ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు జగన్ సర్కార్ కు వ్యతిరేకంగా తీర్పు ఇవ్వడంతో జగన్ సర్కార్ హైకోర్టులో సుప్రీంకు వెళుతున్నట్టు పిటిషన్ దాఖలు చేసింది. 
 
అయితే జగన్ సర్కార్ సుప్రీంకు వెళ్లగా అనుకూల ఫలితాలు వెలువడే అవకాశాలు తక్కువగా ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సాధారణంగా ఒక కొత్త చట్టం అమలు చేసినప్పుడు ఆ చట్టం కొత్త తేదీలతో అమలవుతుంది. ఇప్పటికే పదవిలో ఉన్నవారి పదవీకాలం పూర్తైన తరువాత తరువాత పభుత్వం కావాలనుకుంటే కొత్త చట్టం అమలు చేయవచ్చు కానీ పదవీకాలం పూర్తికాక మునుపే కొత్త చట్టం అమలు చేయాలని ప్రయత్నించినా ఆ చట్టం చెల్లదని న్యాయ నిపుణులు చెబుతున్నారు. 
 
ఒక వ్యక్తికి సంబంధించిన పదవీకాలాన్ని జగన్ సర్కార్ ఉద్దేశపూర్వకంగా చేసిందనే ఆరోపణలు వినిపిస్తూ ఉండటం కూడా ప్రభుత్వానికి నెగిటివ్ గా మారింది. అలా కాకుండా అకస్మాత్తుగా చట్టం తీసుకురావడానికి గల కారణాలు చెప్పమంటే జగన్ సర్కార్ దగ్గర కారణాలు ఉన్నాయా...? అనే ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. విధానపరమైన నిర్ణయం తీసుకునే సమయంలో జగన్ సర్కార్ తప్పు చేసిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళితే గతంలో రంగుల విషయంలో ఎలాంటి తీర్పు వెలువడిందో ఇప్పుడు కూడా అదే తరహా తీర్పు వెలువడే అవకాశం ఉంది. జగన్ సరైన న్యాయ నిపుణులను ఉంచుకుని ప్రణాళికాపరంగా ముందుకు వెళ్లాల్సి ఉంది. ఇప్పటికే టీడీపీ సుప్రీంలో కేవియట్ దాఖలు చేయించింది. నిమ్మగడ్డ వ్యవహారంలో జగన్ ముందుకు వెళ్లకుండా... హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్టే పొందకుండా వేసింది.  ప్రభుత్వం సుప్రీంను ఆశ్రయిస్తే ఈ కేసు ఎలాంటి మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: