దేశవ్యాప్తంగా అమలులో ఉన్న లాక్ డౌన్ జూన్ 30 వరకు పొడిగించడం జరిగింది. ఈసారి కేవలం కంటైమెంట్ జోన్ల వరకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. జూన్ 30వ తేదీ వరకు కంటైన్‌మెంట్‌ జోన్లలో లాక్‌డౌన్‌ కొనసాగుతుందని కేంద్రం ప్రకటించింది. మే 31వ తారీకుతో లాక్‌డౌన్ 4.0 ముగుస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రకటించింది. అంతేకాకుండా ప్రస్తుతం అమలులోకి తీసుకు వస్తున్న ఐదో దశ కు సంబంధించి లాక్ డౌన్ మార్గదర్శకాలను కేంద్రం ప్రకటించింది.

IHG

ఈసారి దశల వారీగా కొన్ని మినహాయింపులు ప్రకటిస్తూ రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని పేర్కొంది. జూన్ 8 వ తారీకు నుంచి దేవాలయాలు మరియు ప్రార్థన మందిరాలు అదేవిధంగా హోటళ్లు, రెస్టారెంట్లు షాపింగ్ మాల్స్ వంటి వాటికి అనుమతి ఇవ్వటానికి కేంద్రం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇక పాఠశాలలు, విద్యా సంస్థలు రీ ఓపెన్ చేయడానికి అధికారాలు రాష్ట్ర ప్రభుత్వాలకే కేంద్రం ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

IHG

ఎట్టి పరిస్థితుల్లోనూ అంతర్జాతీయ విమాన సేవలను అదేవిధంగా సినిమా హాల్స్, జిమ్‌లు, స్విమ్మింగ్‌పూల్స్‌, పార్కులు, బార్లు, రాజకీయ, సామాజిక, క్రీడా కార్యక్రమాలపై ప్రస్తుతానికి అనుమతి ఇవ్వలేదు. ఇటువంటి సమయంలో గోవా ప్రభుత్వం మాత్రం జిమ్ సెంటర్లు ఓపెన్ చేసుకోవడానికి రెడీ అవుతున్నట్లు ఇప్పటికే గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తో మంతనాలు జరిపినట్లు త్వరలోనే దీనికి సంబంధించిన ప్రకటన రానున్నట్లు సమాచారం. కారణం చూస్తే గోవా రాష్ట్రంలో జిమ్స్ తెర‌వాల‌ని చాలా మంది నుంచి డిమాండ్స్ వ‌స్తున్నాయ‌ని అందకే ఆ రాష్ట్ర సీఎం జిమ్ లు ఓపెన్ చేసికోవాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: