వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక తీసుకున్న నిర్ణయాలలో సెన్సేషనల్ నిర్ణయం మూడు రాజధానులు. గతంలో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడిగా ఉన్న సమయంలో అభివృద్ధి మాత్రం హైదరాబాద్ నగరంలో జరగటంతో మిగతా ప్రాంతాలన్నీ నష్టపోయాయని ముఖ్యంగా విభజనతో ఏపీ భయంకరంగా నష్టపోయిందని జగన్ అప్పట్లో అసెంబ్లీ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి సమస్యలు భవిష్యత్తులో మిగిలి ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాకూడదని ఇంకా రాష్ట్ర విభజన జరగకూడదని జగన్ మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట మూడు రాజధానులు కాన్సెప్ట్ ను తెరపైకి తెచ్చారు. దీంతో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మొత్తం వేడెక్కాయి.

 

ఎందుకంటే గత ముఖ్యమంత్రి చంద్రబాబు రాజధానిని కేవలం అమరావతిలో మాత్రమే గుర్తించడం జరిగింది. కానీ వైయస్ జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని వికేంద్రీకరణ పేరిట రాష్ట్రంలో ఉన్న మూడు ప్రాంతాలు రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర అభివృద్ధి జరగాలని సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమరావతిలో లెజిస్లేటివ్ కేపిటల్ కొనసాగిస్తూ.. విశాఖలో ఎగ్జిక్యూటివ్ కేపిటల్, కర్నూల్‌లో జ్యుడిషయల్ ఏర్పాటు దిశగా జగన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై చాలావరకు సంపూర్ణ మద్దతు లభించగా కొన్ని వర్గాలలో అసంతృప్తి నెలకొంది. రాజధాని అమరావతి లోనే ఉంచాలని తలరించే పరిస్థితి రాకూడదని తెలిపారు. ఈ విషయం లో బాగా వ్యతిరేకించింది ఎవరు అంటే అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజలు మరియు ఎక్కువగా చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వాళ్లని ఏపీ రాజకీయాల్లో వార్తలు వస్తున్నాయి.

 

కానీ జగన్ తీసుకున్న ఈ నిర్ణయానికి ఎప్పుడూ అభివృద్ధికి నోచుకోని ఉత్తరాంధ్ర ప్రాంతంలో వైజాగ్ వేదికగా రాజధానిని జగన్ ఏర్పాటు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఉత్తరాంధ్రలో ఒక్కసారిగా వైసీపీ పార్టీకి పట్టు గట్టిగా పెరిగింది. 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని నామరూపాలు లేకుండా ఎక్కువ స్థానాలు గెలిచి ఉత్తరాంధ్రలో పట్టు నిలుపుకున్న జగన్, మరింతగా మూడు రాజధానులు నిర్ణయం తో పార్టీకి ఉత్తరాంధ్రలో భవిష్యత్తు ఉండేలా చూసుకొన్నారు. కాగా ఈ విషయంలో అమరావతి మాత్రమే రాజధానిగా గుర్తించాలని చంద్రబాబు జై కొట్టడంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలలో టిడిపి పార్టీ పై నీలినీడలు అలుముకున్నాయి. జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయాన్ని కి చంద్రబాబు కేవలం అమరావతి కి మాత్రమే రాజకీయ నాయకుడిగా మిగిలిపోయారు. మరొక పక్క ఇతర ప్రాంతాలలో రాజధానిని విస్తరించడంతో ఆ ప్రాంతాలలో వైసిపి పార్టీకి మరింత ఆదరణ లభించింది. ఓవరాల్ గా జగన్ తీసుకున్న 3 రాజధానుల నిర్ణయం తో చంద్రబాబు అమరావతి కి పర్మినెంట్ కాగా వైసీపీ మాత్రం ఇతర ప్రాంతాలలో బలంగా నాటుకుపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: