ప్రస్తుతం దేశవ్యాప్తంగా నాలుగో విడత లాక్ డౌన్  కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే లాక్డౌన్ కొనసాగుతుంది అన్న మాటే గానీ దాదాపుగా అన్ని సడలింపు ఇచ్చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం దుకాణ సముదాయాలు  అన్ని రకాల సముదాయాలు తెరుచుకున్నాయి. పలుచోట్ల రవాణా వ్యవస్థ కూడా పున ప్రారంభమైంది. అయితే ఈ నాలుగో విడత లాక్ డౌన్  మే 31వ తేదీ వరకు ఉండగా ఆ తర్వాత లాక్ డౌన్ పొడిగిస్తారా లేక ఎత్తివేస్తారా  అనే అనుమానం అందరిలో ఉండేది. ఈ క్రమంలోనే జాతిని ఉద్దేశించి మాట్లాడిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ లాక్ డౌన్  జూన్ 30 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 

 


 జూన్ 1వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు దేశవ్యాప్తంగా ఐదో విడత లాక్ డౌన్  కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే దాదాపు 25 శాతం మాత్రమే లాక్ డౌన్  కొనసాగుతుంది ప్రస్తుతం  దేశంలో... ఇక ఇప్పుడు ఐదో విడత లాక్ డౌన్  లో భాగంగా మరిన్ని  సడలింపులు  ఇస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అదే సమయంలో కొన్ని నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వాలకు వదిలేసింది. అన్ని మతాలకు సంబంధించిన ప్రార్థన మందిరాలు తెరిచేందుకు ఐదో విడత లాక్ డౌన్ లో అనుమతులు ఇచ్చింది  కేంద్ర ప్రభుత్వం. అంతేకాకుండా షాపింగ్ మాల్స్ కూడా తెరుచుకునేందుకు అవకాశం ఇచ్చింది. 

 


 కానీ ఈ సినిమా షూటింగ్ లకు సినిమా థియేటర్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదు అంతేకాకుండా రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధించింది కేంద్ర ప్రభుత్వం. అయితే ఎలాగో ఇప్పట్లో కరోనా వైరస్ ప్రభావం తగ్గేలా  లేదు కాబట్టి వైరస్ తో సహజీవనం తప్పదు అన్నట్లుగా ఐదో విడత లాక్ డౌన్  అమలు చేస్తుంది అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పూర్తిస్థాయిలో లాక్ డౌన్  అమలు చేయలేము  కాబట్టి ఇలా సడలింపులతో  లాక్ డౌన్ ఇచ్చింది  అని... అయితే 5 విడత లాక్ డౌన్ లో  భాగంగా కేవలం 10 శాతం మాత్రమే లాక్ డౌన్  కొనసాగనుంది అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: