ఐదేళ్ళ పదవీ కాలంలో మొదటి ఏడాది పదవి కాలం పూర్తయింది వైయస్ జగన్ కి. ఈ పన్నెండు నెలలు చాలు మిగతా కాలం ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవడానికి అన్నట్లుగా జగన్ పాలన ఉంది అన్న టాక్ బలంగా వినబడుతోంది. తెలుగు రాజకీయాలలో చాణిక్యుడి గా పేరొందిన చంద్రబాబు ఆయన అనుచర వర్గం మరియు మీడియా జగన్ పరిపాలన పై ఎంత దుష్ప్రచారం చేసినా గాని మొదటి ఏడాదిలో జగన్ పై ప్రజలకు ఏ మాత్రం కొంచెం కూడా అభిమానం తగ్గలేదు అని వార్తలు వస్తున్నాయి.

IHG

పారిశ్రామిక రంగం అదేవిధంగా సినిమా రంగం మరియు కొన్ని ప్రభుత్వ వ్యవస్థలు సహకరించకపోయినా గాని వైయస్ జగన్ ప్రజలలో తనకున్న ఇమేజ్ కొద్దిగా కూడా పోకుండా చాలా జాగ్రత్తగా వ్యవహరించడం జరిగింది. ఇంగ్లీష్ మీడియం మరియు ఇసుక అదే విధంగా అమరావతి వంటి విషయాలలో ప్రతిపక్షాలు తన ప్రభుత్వంపై బురద వెయ్యాలని ప్రయత్నించిన ఆ విషయాలను చాలా చక్కగా డీల్ చేశారు. ఎక్కడికక్కడ సమస్య వచ్చినా వెంటనే పరిష్కారం చూపే దిశగా అడుగులు వేశారు.

IHG

ప్రపంచం ఎన్నడూ ఎదుర్కొని కరోనా వైరస్ విషయంలో కూడా వైయస్ జగన్ అనుభవం లేకపోయినా రాష్ట్రంలో కరోనా వైరస్ కట్టడి చేయడం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు దేశానికి ఆదర్శ మార్గాలుగా నిలిచాయి. మొత్తం మీద మొదటి ఏడాది పరిపాలనలో అనుభవం లేకపోయినా ముఖ్యమంత్రిగా ఉన్న వైయస్ జగన్ ఎలాంటి మేటర్ అయినా హ్యాండిల్ చేయడంలో దిట్ట అని ప్రతిపక్షాలతో బహిరంగంగా కనిపించకపోయినా లోలోపల అనిపించేలా పరిపాలన చేశారన్న వార్తలు బలంగా ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: