మీరు ఒకటంటే మేము వంద అంటాము అన్నట్లుగా తయారైంది ఇప్పుడు టాలీవుడ్ హీరోల మధ్య వివాదం. చిరంజీవి బాలయ్య మధ్య వివాదం చివరికి చిలికి చిలికి గాలివానలో మారే అవకాశం కనిపిస్తోంది. బాలయ్య తొందరపడో, ఆవేశపడో చిరంజీవి బృందం పైన, టిఆర్ఎస్ మంత్రులపైన విమర్శలు చేసి ఉండొచ్చు. అయితే ఈ వ్యవహారాన్ని ఆషామాషీగా అయితే తీసుకోకూడదు అనే ఉద్దేశంతో మెగా హీరోలు ఉన్నారు. చాలా కాలంగా టాలీవుడ్ లో చాప కింద నీరులా ఆధిపత్య పోరు నడుస్తోంది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా బయట పాడకపోయినా, ఇప్పుడిప్పుడే ఈ వ్యవహారాలు బయట పడుతున్నాయి. ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు నేనే అన్నట్లుగా నందమూరి బాలకృష్ణ ఉండేవారు.  ఎప్పుడైతే టీడీపీ అధికారం కోల్పోయిందో అప్పటి నుంచి బాలయ్య పూర్తిగా సైలెంట్ అయిపోయారు. 

 

తన హవా చెల్లుబాటు కావడం లేదు అనే కోపం, ఆందోళన బాలయ్యలో కూడా ఎక్కువ కనిపిస్తోంది. అందుకే ఆవేశాన్ని పట్టలేక మీడియా ముందు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భూములు అమ్ముకునేందుకు టిఆర్ఎస్ మంత్రితో సినీ పెద్దలు మంతనాలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దానికి వెంటనే చిరంజీవి తమ్ముడు నాగబాబు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఇది అక్కడితో ఆగుతుంది అనుకుంటున్న సమయంలో నాగబాబు కుమారుడు హీరో వరుణ్ తేజ్ ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తుపాకీ పట్టుకున్న వారితో ఏం మాట్లాడగలం అంటూ ఆయన వ్యాఖ్యానించడం, పరోక్షంగా బాలకృష్ణ ఇంట్లో తుపాకీ కాల్పులు జరిగిన వ్యవహారాన్ని వరుణ్ తేజ్ గుర్తుచేశారు. 

 

 

అసలే టిఆర్ ఎస్ మంత్రి పైన బాలయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, చిరంజీవి ప్రస్తుతం టీఆర్ఎస్, ఏపీ ప్రభుత్వాలతో సన్నిహితంగా ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో అనవసరంగా ఎక్కువ చేస్తే, 2004 జూన్ 3న నిర్మాతలు బెల్లంకొండ సురేష్, సత్యనారాయణ చౌదరి లపై బాలకృష్ణ కాల్పులు జరిపిన కేసు ను బయటకు తీయిస్తమనే బెదిరింపు ధోరణితో వరుణ్ తేజ్ ఆ ట్వీట్ పెట్టినట్లుగా ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఏమో అసలే తెలంగాణలో అధికారంలో ఉన్నది కెసిఆర్ ప్రభుత్వం. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: