టాలీవుడ్ హీరోల మధ్య మొదలైన ఆధిపత్యపోరు మరింత తీవ్రం అయ్యేలా కనిపిస్తోంది. ముఖ్యంగా చిరు, బాలకృష్ణ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ఈ వివాదాన్ని మరింత పెద్దది చేస్తున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలోని కొంతమంది సినీ పెద్దలు మంత్రి srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్, సీఎం కేసీఆర్ ను కలవడం పైన హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు. srinivas YADAV' target='_blank' title='తలసాని శ్రీనివాస్ యాదవ్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి హైదరాబాదులో అంతా భూములు పంచుకుంటున్నారు అంటూ బాలయ్య వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది. దీనిపై వెంటనే నాగబాబు కౌంటర్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఈ వివాదంపై స్పందించిన తమ్మారెడ్డి భరద్వాజ  ఇద్దరు సీనియర్లు ఇలా వ్యవహరించడం సరికాదని, సర్దిచెప్పే  ప్రయత్నం చేశారు. 

IHG


ఇలా ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడితే, ఇండస్ట్రీలో పెద్దలు ఉండి ఏం లాభం అంటూ తమ్మారెడ్డి భరద్వాజ గట్టిగానే ఈ వివాదానికి సంబంధించి స్పందించారు. నిన్ననే బాలయ్య వ్యాఖ్యలపై సినీ పెద్దలు కొంతమంది చిరు నివాసంలో కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ఇది ఇలా ఉండగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ సోషల్ మీడియాలో బాలకృష్ణ కు సంబంధించి సోషల్ మీడియాలో హెచ్చరించే ధోరణిలో పోస్ట్ పెట్టడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ వ్యవహారం ఇంత ముదిరిపోతున్నా ,దీనిపై ఇప్పుడు వరకు చిరు స్పందించలేదు.


  దీనిపై కొంత మంది సన్నిహితులు ఈ విషయాన్ని చిరంజీవి దగ్గర ప్రస్తావించగా, ఇవన్నీ చాలా చిన్నచిన్న గొడవలని, ప్రతి చిన్న విషయాన్ని పట్టించుకుంటూ వెళితే చాలా విషయాలపై స్పందించాల్సి వస్తుందని, కొద్ది రోజులు ఆగితే ఇదంతా సర్దుమణుగుతుందని, చిరంజీవి చెప్పినట్లు తెలుస్తోంది. చిరంజీవి స్వయంగా బాలకృష్ణ ను కలిసి ఈ వివాదానికి ముగింపు పలుకుతారు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: