రాష్ట్రంలో జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో ఏడాది పూర్తైంది. 151 ఎమ్మెల్యే స్థానాలు, 22 ఎంపీ స్థానాల్లో విజయం సాధించిన వైసీపీ ఏడాది పాలనలో సంక్షేమ పథకాల అమలుతో ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్తోంది. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో ప్రజలు కూడా వైసీపీ పాలనపై పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 
 
జగన్ సర్కార్ ఇప్పటికే 90 శాతం హామీలను అమలు చేశామని... మిగతా 10 శాతం హామీలను అమలు చేయాలని చెబుతోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం లాంటి నిర్ణయాలు జగన్ కు మంచి పేరు తెచ్చాయి. అయితే రెండు కీలక విషయాల గురించి జగన్ సర్కార్ ముందడులు వేయాల్సి ఉంది. అందులో ఒకటి సీపీఎస్ పెన్షన్ స్కీమ్ కాగా కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో జగన్ ఏ విధంగా వ్యవహరించనున్నారనే ప్రశ్న వినిపిస్తోంది. 
 
జగన్ సర్కార్ ఇప్పటికే సీపీఎస్ పై కమిటీ వేసింది. కాంట్రాక్ట్ ఉద్యోగులను జగన్ సర్కార్ పర్మినెంట్ చేస్తుందా...? చూడాల్సి ఉంది. సీఎం జగన్ ఎన్నికల ముందు హామీ ఇవ్వడంతో ఈ హామీని సీఎం ఎప్పుడు నెరవేరుస్తారో అని ఆశగా ఎదురుచూస్తున్నారు. కొందరు ఉద్యోగులు మాత్రం సీఎం హామీని మరిచిపోయారా...? అని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు. జగన్ సర్కార్ ఒక కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి కాంట్రాక్ట్ ఉద్యోగులను దానిలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోందని కొందరు చెబుతున్నారు. 
 
సీఎం ప్రధానంగా కాంట్రాక్ట్ విద్యుత్ ఉద్యోగుల, సెక్రటేరియట్ కాంట్రాక్ట్ ఉద్యోగులను దృష్టిలో ఉంచుకుని ఈ హామీ ఇచ్చారు. గతంలో తెలంగాణ సర్కార్ కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాల్ని ప్రయత్నించినా కోర్టు నుండి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కొందరు కాంట్రాక్ట్ ఉద్యోగులు మాత్రం కార్పొరేషన్ కింద కాంట్రాక్ట్ ఉద్యోగులను చేర్చకుండా పర్మినెంట్ చేసేలా ప్రభుత్వం ప్రయత్నించాలని వారు కోరుకుంటూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: