ఒక్కో రాజకీయ పార్టీకి ఒక్కో సిద్ధాంతం ఉంటుంది. ఆ సిద్ధాంతం ప్రకారం ముందుకు వెళ్తుంటారు. కొంతమంది ఆ సిద్ధాంతాలను పక్కనపెట్టి తమ స్వలాభం కూడా చూసుకుంటూ ఉంటారు. అలాగే క్రమశిక్షణ విషయంలో పార్టీ అధినేతలు కొంతమంది కఠినంగా ఉంటే మరి కొంతమంది చూసీచూడనట్టుగా వదిలేస్తూ ఉంటారు. ఏపీ సీఎం జగన్ విషయానికొస్తే అధికారం చేపట్టిన దగ్గర నుంచి పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ ఎక్కడ అవినీతి అనేది లేకుండా చూస్తాను అంటూ పదేపదే చెబుతూ వస్తున్నారు. దానికి తగినట్టుగానే, ప్రతి విషయంలోనూ పారదర్శకత ఉండేలా పరిపాలన అందిస్తున్నారు . ముఖ్యంగా ప్రజలు ఎవరు ఏ పని కోసం, ఎక్కడికి తిరిగే అవసరం లేకుండా గ్రామ వాలంటీర్ల వ్యవస్థను కూడా తీసుకువచ్చారు. పూర్తిగా వైసీపీ ప్రభుత్వం పాలనలో అవినీతి అనేదిఉండకూడదు అనేది జగన్ సిద్ధాంతంగా కనిపిస్తోంది.

 

 జగన్ ఇటు వంటి కఠిన నిర్ణయం తీసుకోవడానికి గత తెలుగుదేశం పార్టీ కూడా పరోక్షంగా కారణం అవ్వచ్చు. ఎందుకంటే గత టిడిపి ప్రభుత్వంలో, మంత్రులను, ఎమ్మెల్యేలను చంద్రబాబు వారి ఇష్టానికి వదిలేసారు. ఫలితంగా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు సహకరించి పూర్తిగా అవినీతి వ్యవహారాల్లో మునిగి తేలారు. సంపాదించుకునే వారికి సంపాదించుకున్న అంత అన్నట్లుగా ఎవరికి వారు భావించారు. ముఖ్యంగా ఇసుక దగ్గర నుంచి దేనిని వదిలిపెట్టకుండా అన్నిట్లోనూ బాగా వెనుకేసుకున్నారు.అనే విమర్శలు అప్పట్లో వచ్చాయి. ఇదంతా సర్వసాధారణమే అన్నట్లుగా చంద్రబాబు మంత్రులు, ఎమ్మెల్యేలను కట్టడి చేయకుండా వారి ఇష్టానికి వదిలి వేయడంతో ఈ వ్యవహారం బాగా ముదిరిపోయింది. కానీ ఎన్నికల ఫలితాలు చూస్తే, ఎన్నికల తర్వాత తెలుగుదేశం పార్టీ చూశాక కానీ ఎంత టాపిడం జరిగింది అనేది చంద్రబాబు బాగా తెలిసొచ్చింది.

 

 ఇక అటువంటి వ్యవహారాలు వైసీపీ ప్రభుత్వంలో జరగకూడదనే ఉద్దేశ్యంతో జగన్ మొదటి నుంచి అవినీతి వ్యవహారం చోటుచేసుకోకుండా పూర్తిగా మంత్రులను, ఎమ్మెల్యేలను కట్టడి కట్టడి చేస్తున్నా, జగన్ కు మంత్రులు కొంతమంది అవినీతి వ్యవహారాలకు పాల్పడుతున్నారనే అనుమానం కలగడంతో వారిపై పూర్తిగా నిఘా పెట్టినట్టు  తెలుస్తోంది. అంతేకాకుండా ఆయా శాఖలకు సంబంధించి  పిఆర్వో లు, ముఖ్య కార్యదర్శిలుగా జగన్ కు అత్యంత నమ్మకమైన వ్యక్తులను మంత్రుల షెపీల్లో నియమించినట్టు తెలుస్తోంది. దీంతో మంత్రులు ఏ వ్యవహారం చేసినా, వెంటనే దానికి సంబంధించిన విషయం ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలిసేలా జగన్ ఏర్పాటు చేయడంతో మంత్రులు ఆందోళన చెందుతూ అప్రమత్తంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: