పేదల బ్రతుకు తెగిన గాలిపటం వంటిదని ప్రతి క్షణం గుర్తుకు వస్తూనే ఉంటుంది.. అయినా ఏం చేస్తారు.. జానెడు పొట్టకోసం తప్పవుగా ఎన్నో తిప్పలు.. కడుపు నిండిన వాడికి కష్టాలు ఒక లెక్క కాదు.. కానీ ఆకలితో అలమటించే వారికి, రెక్కాడితే గానీ డొక్కాడని వారికి ప్రతి పైసా విలువైనదే.. అందుకే ఎండనక, వాననక, చలి అనక కష్టజీవులు రెక్కలు ఆడిస్తుంటారు.. ఆ జీవిత సమరంలో ఒక్కోసారి తెలియకుండానే ప్రాణాలు ఆరిపోతాయి.. అప్పుడనిపిస్తుంది.. ఛీ దీనమ్మ జీవితం.. ఇంత దరిద్రపు బ్రతుకు వేరేవరికి ఉండకూడదని.. వారు పేదలుగా పుట్టడమే శాపంగా మారుతుంది.. అందుకే ఎందరు పేదవారు, వలసకూలీలు మరణించినా అధికారుల స్పందన అంతంత మాత్రంగానే ఉంటుంది..

 

 

ఇకపోతే పాపం ఒక అభాగ్యురాలు పనిచేసి అలసిపోయి కాస్త సేదతీరుదామని అనుకుని తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది.. కొంత ఉపశమనం కలిగిస్తుందనుకున్న వాహనమే ఆమె పాలిట మృత్యుశకటమైంది.. కూటి కోసం పొట్ట చేతపట్టుకొని వచ్చిన వలస బతుకు అర్ధంతరంగా ముగిసింది.. ఆ అమాయకురాలు కాసేపు నిద్రించాలనుకుంది కానీ శాశ్వత నిద్రలోకి జారుకుంది.. ఆ వివరాలు చూస్తే.. ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లా సీక్‌పాల్‌ గ్రామానికి చెందిన కోసి(20) అనే యువతి అయిదు నెలల క్రితం కూలి పనులు చేసుకునేందుకు భర్తతో కలిసి సారపాక వచ్చారు. ఇక్కడ దంపతులిద్దరూ జామాయిల్‌ కర్ర నరుకుతూ జీవనం సాగిస్తున్నారు.

 

 

ఈ క్రమంలో శనివారం ఎండ వేడి అధికంగా ఉండటంతో ఆ యువతి మధ్యాహ్నం అక్కడే నిలిపి ఉంచిన ట్రాక్టర్‌ కింద కొంతసేపు సేద తీరేందుకు నిద్రకు ఉపక్రమించింది. కాగా ట్రాక్టరు డ్రైవరు అది గమనించకుండా వాహనాన్ని వెనక్కి పోనివ్వడంతో  కోసి తల ఛిద్రమై అక్కడికక్కడే మరణించింది.. ఇకపోతే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని బూర్గంపాడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. చూశారా విధి రాత అంటే ఇదే కావచ్చూ.. 

మరింత సమాచారం తెలుసుకోండి: