లాక్ డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల పాటు బోసిపోయిన తిరుమల శ్రీవారి ఆలయానికి మరో కొద్ది రోజుల్లోనే పునర్వైభవం రానుంది. జూన్‌ 8 నుంచి తిరుమల శ్రీవారి ఆలయాన్ని తెరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం శనివారం ప్రకటించిన ఐదో విడత లాక్‌డౌన్‌ ప్రకటనలో దేశవ్యాప్తంగా ఆలయాలు తెరిచేందుకు పచ్చజెండా ఊపేసింది.

దీంతో వెంకన్న దర్శనానికి మార్గం సుగమం అయ్యింది.

 

కేంద్రం విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం టీటీడీ అధికారులు దర్శనాల కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నారు. కరోనా నిబంధనలకు అనుగుణంగా ఎలా దర్శనాలు చేపట్టాలనే అంశంపై టీటీడీ ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చింది. ఆ ప్రకారం మాక్ దర్శనాలు కూడా నిర్వహించింది. ఇక ఎప్పుడు ప్రకటన వచ్చినా దర్శనాల కోసం అంతా సిద్ధం చేసుకున్నామని టీటీడీ ఛైర్మన్ కూడా గతంలోనే ప్రకటించారు.

 

 

అయితే తిరుమల శ్రీవారి దర్శనాల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. వాటి కోసం టీటీడీ ఎదురుచూస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే వెంటనే దర్శనాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది. ఇకపై తిరుమల వచ్చే భక్తులకు ఆన్‌లైన్‌, కరెంట్‌బుకింగ్‌ కౌంటర్ల ద్వారా టైమ్‌స్లాట్‌ టిక్కెట్లను కేటాయిస్తారు.

 

 

ఇక దర్శనాల సమయంలో మాస్కులు, గ్లౌజులను తప్పనిసరి. అంతేకాదు.. తిరుమల వచ్చే ప్రతి భక్తుడికీ అలిపిరి తనిఖీ కేంద్రం, మెట్లమార్గంలోనే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు.

ఆ తర్వాతే కొండపైకి అనుమతిస్తారు. దర్శనం సమయంలోనూ ఎక్కడా నిరీక్షించే అవకాశం ఉండదు. గతంలోలా క్యూ కాంప్లెక్సుల్లో నిరీక్షణ ఉండదు. నేరుగా దర్శించుకోవడమే . ఇందుకు అనుగుణంగానే టికెట్లు జారీ చేస్తారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: