తాము చేపట్టే కార్యక్రమాలు, ఉద్యమాలు, తమ వాయిస్, సామాన్య జనాలకు తెలియాలంటే సొంతంగా పత్రిక ఛానల్ ఉండాలనే విషయం జనసేన ఇప్పటికి  గుర్తించినట్లుగా కనిపిస్తోంది. తాము ఎన్ని ఆందోళనలు, ఉద్యమాలు చేస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం జనసేన కు మైలేజ్ రావడం లేదని, అసలు జనసేన చేస్తున్న కార్యక్రమాలు ఏవీ సామాన్య జనాలకు తెలియడం లేదని, కేవలం సోషల్ మీడియాని ఫాలో అయ్యే వారికి తప్ప మిగతా వారికి తమ పార్టీ కార్యక్రమాల గురించి సమాచారం ఉండడం లేదనే విషయాన్ని జనసేన గుర్తించింది. 2024 ఎన్నికల్లో పార్టీ మెజారిటీ స్థానాలను దక్కించుకోవాలి అంటే ఇప్పటి నుంచే జనాల్లోకి పార్టీ వెళ్లాలని, దాని కోసం సొంతంగా ఒక పత్రిక, ఒక న్యూస్ ఛానల్ ఏర్పాటు చేసుకుంటే మంచిదనే ఆలోచనకు జనసేన నాయకత్వం వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో అతిపెద్ద పార్టీలుగా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్, టిడిపిలను ఎదుర్కొని ముందుకు వెళ్లాలంటే ఇదే సరైన మార్గమని భావిస్తోంది. ఇప్పటి వరకు జనసేన వాయిస్ జనాల్లోకి వెళ్లకుండా, ప్రధాన మీడియా అడ్డుకుంటోందని, కేవలం జగన్, చంద్రబాబు చేస్తున్న కార్యక్రమాలను హైలెట్ చేస్తున్నారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. 

IHG


జగన్ కు సొంతంగా సాక్షి టీవీ, ఛానల్ ఉండబట్టే ఆయన ప్రతిపక్షం లో ఉండగా చేసిన పోరాటాలు, ఉద్యమాలు గురించి జనాల్లోకి బాగా వెళ్లిందని, అదే లేకపోతే ఆయన సీఎం అయి ఉండేవారు కాదనేది ఆ పార్టీ ఇప్పుడు విశ్లేషించుకుంటున్నారు. మీడియాలో మెజారిటీ భాగం టిడిపి అధినేత చంద్రబాబు వెర్షన్ ను మాత్రమే హైలెట్ చేసి చూపిస్తున్నాయని, మిగతా వారి గురించి పట్టించుకోవడంలేదని, జనసేన సోషల్ మీడియాలో శతఘ్ని టీమ్ సమర్ధవంతంగా పని చేస్తూ తమ రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకు గట్టిగానే సమాధానం చెబుతూ, జనసేన వాయిస్ జనాల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నా, సామాన్యుల వరకు చేరడంలేదని, కేవలం కొద్దిమంది మాత్రమే జనసేన కార్యక్రమాల గురించి తెలుస్తోందని, అదే సొంత పత్రిక, ఛానల్ ఉంటే ప్రతి ఒక్కరికి జనసేన కార్యక్రమాలు గురించి తెలుస్తుందనే అభిప్రాయానికి పవన్ తో సహా ఆ పార్టీ నాయకులు అంతా వచ్చారు.


 ఇప్పటికే జనసేన కీలక నాయకుడు తోట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో 99 చానల్ ఉన్నా, ప్రజల్లోకి జనసేన వాయిస్ తీసుకెళ్లే విషయంలో విఫలమైందని, అందుకే జనసేనకు పార్టీ తరఫున ప్రత్యేకంగా ఒక పత్రిక, ఛానల్ ఏర్పాటు చేస్తే మంచిదని అభిప్రాయానికి పవన్ తో సహా ఆ పార్టీ నాయకులు అందరూ వచ్చినట్లు సమాచారం. ఈ మేరకు త్వరలోనే పత్రిక ఛానల్ ఏర్పాటు చేసే దిశగా వారు అడుగులు వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: