చేసేపని ఏదైనా దైవంతో సమానం అంటారు.. నిజంగా చిత్తశుద్ది ఉన్న వారు.. తాము చేసేపనిలో దాదాపుగా ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటారు.. చివరికి మున్సిపాలిటిలో పనిచేసే కింది తరగతి ఉద్యోగులు కూడా ఆ మురికి పనినే తమ దైవంగా భావించి నిర్వహిస్తారు కాబట్టే వీధులన్ని శుభ్రంగా కనిపిస్తాయి.. పని చేయడంలో తేడా ఉంటుంది కాని పనిలో ఎలాంటి మార్పు ఉండదు.. ఇక ఉద్యోగాన్ని తమ ధర్మంగా భావించి పనిచేసే వారు అన్ని శాఖలలో చాల తక్కువగా కనిపిస్తారు కాబట్టే మన వ్యవస్ద ఇంత లేజీగా తయారైంది..

 

 

ఇకపోతే సమాజంలో నిర్వహించే కొన్ని విధులు ఎంతో ఉన్నతమైనవి.. అందులో పోలీస్ వ్యవస్ద, హస్పిటల్స్ ఉద్యోగులు, మున్సిపల్ శాఖ.. ఇవే గాక చాలా ఉన్నాయి.. ఆయా శాఖల్లో పనిచేసే వారు ఇది తమ పనే అని భావించి చేస్తే ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు.. కానీ అలా భావించి చేయరు కాబట్టి ప్రజలకు, ఆయా సంస్దలకు చెడ్దపేరు వస్తుంది.. అందులో పోలీస్ వ్యవస్ద గురించి చెప్పుకోవలసి వస్తే.. ఇందులో ఎంత నిజాయితీ పరులు ఉన్నారో, అంతే అవినీతి పరులు ఉన్నారు.. కొందరైతే తమ బాధ్యతను విస్మరించి ఖాకీ అనే అహాంతో విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ సామాన్యులకు ఇబ్బందులు కలిగిస్తున్నారు..

 

 

తాజాగా విధి నిర్వహణలో ఉన్న ఓ హోంగార్డు కూడా ఫుల్‌గా మద్యం తాగి, తూగుతూ దారిన వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురి చేసిన సంఘటన కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది.. స్థానికుల కథనం ప్రకారం.. సీఆర్‌ హెడ్‌క్వార్టర్స్‌కు చెందిన హోంగార్డు శ్రీనివా‌స్‌కు కుల్సుంపురా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో విధులు కేటాయించగా, వారం రోజులుగా ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఇతను, శనివారం వేకువజామున సుమారుగా రెండు గంటల ప్రాంతంలో, మద్యం మత్తులో జియాగూడలో ఉన్న గోపి హోటల్‌ సమీపంలోని  రోడ్డుపై హంగామా సృష్టించాడు.

 

 

కాగా ఈ విషయాన్ని స్దానికులు పోలీసులకు తెలియచేయగా వారు వచ్చి ఆ హోంగార్డును అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపధ్యంలో అక్కడి సీఐ పి. శంకర్‌ మాట్లాడుతూ ఇతని విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: