గత కొన్ని రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్ విజృంభిస్తుంది.  మరణాల సంఖ్య కూడా పెరిగిపోతున్నాయి.   ఏపీలో గత 24 గంటల్లో 9,504 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 70 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దాంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,944కి చేరింది. కొత్త కేసుల్లో మూడింటికి కోయంబేడు లింకు ఉన్నట్టు గుర్తించారు. ఇవాళ 55 మంది డిశ్చార్జి కాగా, ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 2,092కి పెరిగింది. ప్రస్తుతం ఆసుపత్రుల్లో 792 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది.

 

ఇక, గడచిన 24 గంటల్లో తెలంగాణలో 74 కొత్త కేసులు వెల్లడయ్యాయి. వాటిలో 60 స్థానికులవి కాగా, మరో 14 కేసులు బయటి నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో గుర్తించారు. ఎప్పట్లానే జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు గుర్తించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఇవాళ 41 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.  కరోనాతో మరో పసిప్రాణం బలైంది. నాగర్ కర్నూల్ జిల్లా ఉప్పునుంతలలోని బీసీ కాలనీలో రెండు నెలల చిన్నారి కరోనాతో మృతి చెందింది. గత నెల 3న నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాస్పత్రిలో మగశిశువు జన్మించాడు.

 

పది రోజులు హాస్పిటల్ లో ఉన్న తల్లిశిశువులు ఉప్పునుంతలకు వెళ్లారు. కాగా, ఆ బాబు ఈ నెల 27నుండి అనారోగ్యంగా ఉండడంతో తల్లి తండ్రులు ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చూపించారు. అక్కడి డాక్టర్లు శిశువును హైద్రాబాద్ లోని నిలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేసారు. అయితే, నిలోఫర్ హాస్పిటల్ కి తరలించే లోపే శిశువు మరణించాడు. బాబు రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేయగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో అతడి తల్లి తండ్రులకు కూడా పరీక్షలు చేసారు. శిశువు కరోనా సోకి మరణించడంతో ఉప్పునుంతల గ్రామస్థులు బయాందోళనకు గురవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: