తెలంగాణలో ఇప్పటి వరకు 30 వేల కరోనా టెస్టులు చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంటే మూడు నెలల్లో 30 వేల టెస్టులు చేసినట్టు లెక్క. గతంలో  ప్రతి రోజూ 50 నుంచి 100 టెస్టులు చేస్తే, ఇపుడు మాత్రం రోజుకు 2 వందల నుంచి 3 వందల వరకు టెస్టులు చేస్తున్నారు.  రానున్న రోజుల్లో టెస్టుల సంఖ్య పెంచుతామంటోంది వైద్య శాఖ. 

 

తెలంగాణా లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి... దాంతో ప్రస్తుతం టెస్టుల సంఖ్య 30 వేలు దాటింది. మొదట్లో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతో కరోనా కేసులు నమోదయ్యాయి.. తర్వాత మర్కజ్ తో మరిన్ని కేసులు పెరిగాయి. ఇపుడు ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతో కేసులు పెరిగి పోతున్నాయని వైద్య శాఖ వెల్లడించింది.

 

వందే భారత్ లో భాగంగా  వచ్చిన వారికి పాజిటివ్స్ వస్తున్నాయి.  విదేశాల నుంచి తిప్పి పంపిన వారిలో ఎక్కువగా కేస్ లు నమోదు అవుతున్నాయి. విదేశాల నుంచి తిప్పి పంపిన వారిలో కొందరు అక్కడ జైళ్లలో ఉండి వచ్చిన వారు కూడా ఉన్నారు.  ప్రస్తుతం వాళ్ళ వల్ల కేసులు పెరుగుతున్నట్లు చెప్పారు  అధికారులు.   లాక్ డౌన్ సడలింపుల తర్వాత ప్రజల మూమెంట్ పెరగటం వల్ల  కూడా కరోనా కేసులు పెరుగుతున్నాయని చెబుతోంది ప్రభుత్వం. అంతేకాదు.. మున్ముందు మరిన్ని కేసులు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

 

కేసుల లెక్కల్ని విశ్లేషించిన అధికారులు...తెలంగాణాలో మొత్తం 546 కుటుంబాల్లో కరోనా వ్యాప్తి జరిగిందని వెల్లడించారు. సూర్యాపేటలో ఒక వ్యక్తి వల్ల 82 మందికి పాజిటివ్ వచ్చింది. హైదరాబాద్ బోరబండలో ఒక యువకుడు అమ్మమ్మ ఇంటికి వెళ్లి  పార్టీ చేసుకోగా 20 మందికి కరోనా సోకింది.  లాక్ డౌన్ సమయం లో కొందరు వ్యక్తుల వల్ల అనేక కుటుంబాలు వైరస్ బారిన పడ్డాయని వైద్యాధికారులు తెలిపారు. మరోవైపు ఇప్పటి వరకు తెలంగాణాలో కమ్యూనిటీ స్ప్రెడ్ జరగ లేదని స్పష్టం చేశారు అధికారులు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: