దేశంలో ఎన్ని జాగ్రత్తలు, లాక్ డౌన్ లు పొడిగిస్తూ వెళ్తున్న కరోనా వైరస్ మాత్రం వ్యాపించుకుంటూ వెళ్ళిపోతోంది. ఇప్పటివరకు వైరస్ కంట్రోల్ అయిన దాఖలాలు ఎక్కడా కనబడటం లేదు. ముఖ్యంగా మహారాష్ట్రలో అయితే మొదటినుండి కరోనా వైరస్ అత్యంత ప్రమాదకరంగా తన ప్రభావాన్ని చూపుతోంది. ఇప్పటికే నాలుగు లాక్ డౌన్ లు అమలు చేసి ఐదో దశ లాక్ డౌన్ పొడిగించిన కేంద్రం మహారాష్ట్ర విషయంలో ఆ రాష్ట్ర సర్కార్ కి హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. ఒకవైపు పాలనా అనుభవం లేని సీఎం, మరోవైపు సమన్వయం లోపం పాజిటివ్ కేసులు పెరగడానికి కారణం అనే  వార్తలు వస్తున్నాయి. ట్రాక్, ట్రేస్, టెస్ట్, ట్రీట్ చేయడంలో ముందునుండి ఉద్ధవ్ థాక్రే సర్కార్ ఫెయిల్ అయ్యిందన్న వార్తలు బలంగా వినబడుతున్నాయి.

IHG

ఇదిలా ఉండగా ప్రజల ప్రాణాల కోసం త్యాగాలు చేస్తూ ఫ్రంట్ లైను లో ఉన్న మహారాష్ట్ర పోలీసులకు రోజువారీ కేసుల్లో ఎక్కువ పాజిటివ్ రావడంతో వాళ్లకి నైతిక స్థైర్యం ఇవ్వలేకపోతున్నారు అన్న కొత్త విమర్శ ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వంపై పడుతోంది. మహారాష్ట్రలో రోజురోజుకీ నమోదవుతున్న పాజిటివ్ కేసులు, మరోపక్క ఎక్కువగా పెద్ద సంఖ్యలో పోలీసులు వైరస్ బారిన పడినట్లుగా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మహారాష్ట్ర పోలీసులు మరియు అధికారులు కరోనా డ్యూటీ చేయటానికి తెగ ఆందోళన చెందుతున్నారు.

IHG

పరిస్థితి ఉన్న కొద్ది విషమిస్తున్న తరుణంలో మహారాష్ట్ర పోలీసు శాఖ  నివారణ చర్యలు చేపట్టింది. మధుమేహం - బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 52 మంది పోలీసు సిబ్బందిని ఇళ్లల్లోనే ఉండాలని ఈ సందర్భంగా ఆదేశాలు కూడా జారీ చేశారు. మహారాష్ట్రలో మొత్తం కేసులు 62228 - మరణాలు 2098 ఉండగా రాష్ట్ర రాజధాని - దేశ ఆర్థిక రాజధానిగా ఉన్న ముంబైలోనే అత్యధికంగా ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై కావటంతో కేంద్రం కూడా ఈ విషయంలో చాలా ఆందోళన చెందుతోంది. ఈ విషయంలో మహారాష్ట్ర సర్కార్ పై దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వస్తున్నాయి. ప్రజలను కాపాడాల్సిన పోలీసుల పరిస్థితి ఇలా ఉందంటే, మహారాష్ట్రలో పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అని విమర్శలు చేస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ముఖ్యమంత్రి కాలేని ఉద్ధవ్ ఠాక్రే తన రాజకీయ స్వలాభం కోసం ఈ విధంగా ప్రజలు మరియు పోలీసుల ప్రాణాలతో చెలగాటం ఆడటం మహారాష్ట్ర ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని కామెంట్ చేస్తున్నారు. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: