మహమ్మారి కరోనా వైరస్ కారణంగా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో గత రెండు నెలలకు పైగానే దేశంలో అన్ని దేవాలయాలు క్లోజ్ అయిన సంగతి అందరికి తెలిసిందే. ఈ వైరస్ మనుషులు గుంపులు గుంపులుగా ఉండే చోట సమావేశాలు అయ్యే చోట ఎక్కువగా విస్తరించే అవకాశం ఉండటంతో ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న ప్రతి దేశంలో ఆలయాలు, మసీదులు, చర్చిలు క్లోజ్ చేసేస్తున్నారు. ఈ విధంగానే ఇండియాలో కేంద్ర ప్రభుత్వం అని విశ్వాసాలకుసంబంధించిన మందిరాలు క్లోజ్ చేయడం జరిగింది. ఎటువంటి పరిస్థితుల్లో శ్రీవారి భక్తులకు టీటీడీ ప్రసాదం ఇవ్వటానికి సరికొత్త ఆలోచన చేపట్టింది. లాక్ డౌన్ కారణంగా శ్రీవారిని దర్శించుకుని పరిస్థితి ఏర్పడటంతో శ్రీవారి భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని చేరవేయాలని టీటీడీ డిసైడ్ అయ్యింది.

IHG'laddu' subsidised sales to start in <a class='inner-topic-link' href='/search/topic?searchType=search&searchTerm=HYDERABAD' target='_blank' title='hyderabad-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>hyderabad</a> from ...

దీనిలో భాగంగా నగరాలలో కొన్ని ఏరియాల ని సెలెక్ట్ చేసుకుని టీటీడీ లడ్డూ ప్రసాదాలను భక్తులకు అందించే కార్యక్రమాన్ని సంకల్పించింది. ఈ సందర్భంగా లడ్డూ ప్రసాదాలను కావాలనుకునేవారు భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్ లు ధరించాలి అని టీటీడీ సిబ్బంది తెలిపింది. దీంతో ఇటువంటి మహమ్మారి వైరస్ వచ్చిన రోజుల్లో కూడా భక్తుడు భగవంతుడు దగ్గరికి రాలేకపోయినా కానీ టీటీడీ తీసుకున్న నిర్ణయం వల్ల భగవంతుడే భక్తుడి దగ్గరికి వచ్చినట్లు ఉందని శ్రీవారి భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా టీటీడీ లడ్డూల్ని పెద్ద ఎత్తున కావాలనుకునే వారి కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

IHG

ఇందుకోసం ఆలయ డిప్యూటీ ఈవో హరీంద్రనాథ్ 9849575952.. ఆలయ పేష్కార్ శ్రీనివాస్ 9701092777 సెల్ కు ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వొచ్చు అని అన్నారు. అంతేకాదు.. టీటీడీ కాల్ సెంటర్ టోల్ ఫ్రీ నంబర్లు 18004254141, 1800425333333 ఫోన్లు చేసి కూడా ఆర్డర్లు ఇవ్వొచ్చు. సో ఇంటి నుండి బయటకు రాలేని తాతయ్య అమ్మమ్మ లకి ప్రసాదం ఈ విధంగా ఆన్లైన్ ఆర్డర్ ద్వారా టీటీడీ అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో హిమాయత్ నగర్ లో టీటీడీ ఆఫీస్ వద్ద మరియు ఇదే ఏరియాలో బాలాజీ భవన్ లో అమ్ముతున్న టీటీడీ సిబ్బంది రానున్న రోజుల్లో జూబ్లీహిల్స్ లో టీటీడీ టెంపుల్ లో ప్రసాదాలు పంపిణి షురూ చేయనున్నట్లు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: