కాదేదీ కిక్కుకు అనర్హం అనుకున్నారు.. చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నారు.  దేశంలో కరోనా మహమ్మారి మొదలైన్పటి నుంచి మద్యం షాపులు బంద్ చేసిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సమయంలో మందు బాబుల పిచ్చి పీక్ స్టేజ్ కి వెళ్లింది.. ఎందో మంది ఎర్రగడ్డ పాలయ్యారు. కొంత మంది తమ కుటుంబ సభ్యులపై దాడులు చేశారు.. కొంత మంది ఉన్మాదులుగా మారి గందరగోళం చేశారు.  ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఎన్నో సంఘటనలు చోటు చేసుకున్నాయి.  ఆ సమయంలో మందుకు బదులు గా కొంత మంది గ్లిజరిన్, మెడిసన్స్, దగ్గు మందు ఇతర ఆల్కాహాల్ కి సంబంధించిన రసాయనాలు తాగి ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు.. కొంత మంది ప్రాణాలే పొగొట్టుకున్నారు.  తాజాగా  విశాఖ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మత్తుకోసం సర్జికల్ స్పిరిట్ తాగి ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. జిల్లాలోని కశింకోట గోవిందరావు కాలనీలో ఆదివారం ఈ ఘటన జరిగింది.

 

గోవిందరావు కాలనీకి చెందిన కూనిశెట్టి ఆనంద్‌ రావ్‌ స్నేహితులతో పార్టీ చేసుకుందామనుకున్నారు. మత్తుతో బాగా కిక్ ఎక్కాలనుకున్నాడు. ఇందుకోసం మత్తు ఎక్కువగా ఉంటుందని స్పిరిట్‌ను తనతో తీసుకొని వచ్చాడు.  అయితే  ఆ స్పిరిట్ తాగితే మరింత మత్తు వస్తుందని భావించారు. పార్టీలో ఆరుగురు పాల్గొన్నారు. అందరికీ స్పిరిట్ తాగితే బాగా మత్తు ఎక్కుతుందని చెప్పాడు. అయితే నలుగురు మాత్రమే ఆ స్పిరిట్‌ తాగారు. ఇద్దరు తాగమన్నారు.

 

తాగిన వెంటనే తీవ్ర అస్వస్థతకు గురైన ఆ నలుగురిలో ముగ్గురు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.  పిచ్చికిక్కు కోసం ముగ్గురు చేసిన పనికి ఇప్పుడు వారి కుటుంబ సభ్యులు అలాథలుగా మిగిలిపోయారు.  ఇప్పటికే లాక్ డౌన్ కష్టాల నుంచి బయట పడక ముందే.. ఇలాంటి ఘాతుకాలకు పాల్పపడుతున్నారు కొంత మంది మూర్ఖులు.  ఏది ఏమైనా ఇలాంటి పనులు చేయవొద్దని డాక్టర్లు, పోలీసులు హెచ్చరిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: