లాక్ డౌన్  సమయంలో దేశ వ్యాప్తంగా రవాణా వ్యవస్థ స్తంభించి పోవటంతో తండ్రిని సైకిల్ పై ఎక్కించుకుని వేల కిలోమీటర్లు నడిపించుకుని వెళ్ళినా బాలిక సోషల్ మీడియాలో సెలబ్రిటీ గా మారిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఆమె చేసిన ఈ పనికి స్వయంగా అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ కూడా ప్రశంసలు కురిపించింది. ఇదిలా వుండగా ఆ బాలిక జ్యోతి ఇంటికి స్వచ్ఛంద సంస్థలకి చెందిన పెద్దలు భారీగా తరలివస్తున్నారు.

IHG

దాదాపు పన్నెండు వందల కిలోమీటర్లు సైకిల్ పై తన తండ్రిని ఎక్కించుకొని ఆమె పడిన కష్టానికి పలు స్వచ్ఛంద సంస్థలు ఆమెకు సహాయం చేయడానికి రెడీ అవుతున్నారు. ఢిల్లీ నుండి బీహార్ వరకు పన్నెండు వందల కిలోమీటర్లు సైకిల్ పై తన తండ్రిని ఎక్కించుకుని తొక్కడం జ్యోతి కుటుంబం బాగా పేద కుటుంబం కావడంతో ..ఆమె చేసిన సాహసానికి పలు స్వచ్ఛంద సంస్థలు భారీ స్థాయిలో సహాయం చేయడానికి రెడీ అవ్వుతున్నట్లు సమాచారం.

IHG

ఈ క్రమంలో ఇంటికి వస్తున్న వారికి తన ఇల్లు చిన్నది కావడంతో పక్కన టెంటు వేసి వారితో ముచ్చటిస్తూ ఉంది జ్యోతి. ప్రతి ఒక్కరి తో కలిసి మాట్లాడుతోంది. తన తల్లికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటం కోసం ఇంత సాహసానికి ఒడిగట్టినట్లు తెలిపింది. ఈ క్రమంలో పలు స్వచ్ఛంద సంస్థలు జ్యోతి కి ఉద్యోగం ఇవ్వాలని ఆలోచిస్తూ ఉండగా మరికొన్ని స్వచ్ఛంద సంస్థలు ఆ కుటుంబానికి ఇల్లు కట్టించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.  

మరింత సమాచారం తెలుసుకోండి: