దేశంలో ఫిబ్రవరి నెల నుంచి కరోనా మొదలైంది.  అప్పటి నుంచి మెల్లి మెల్లిగా కరోనా కేసులు పెరగడం తర్వాత మార్చి 24 నుంచి దేశం మొత్తం లాక్ డౌన్ ప్రకటించారు. అప్పటి నుంచి ప్రజలు  రక్షణ కోసం పోలీసులు, డాక్టర్లు, పారిశుద్ద్య కార్మికులు తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. యావత్ ప్రపంచం మొత్తం వీరి సేవలకు సలాం చేస్తుంది. అయితే కరోనా మహమ్మారి ఎవరినీ వదలడం లేదు.  రక్షణ కల్పిస్తున్న పోలీసులకు, డాక్టర్లకు వ్యాపిస్తూ ప్రాణాలు హరిస్తుంది.  మహారాష్ట్రలో కరోనా బీభత్సం సృష్టిస్తోంది. ప్రజలకే కాకుండా ప్రజలకు రక్షణగా నిలుస్తున్న పోలీసులకు కూడా కరోనా సోకడం తీవ్ర ఆందోళనలకు గురిచేస్తోంది.  కరోనా సంక్షోభంలో ప్రతి నిముషం విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులు వేల సంఖ్యలో వైరస్‌ బారిన పడుతున్నారు. గత 24 గంటల్లో 91 మంది పోలీసులకు కరోనా పాజిటివ్‌గా తేలిందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతో మొత్తం కరోనా బారిన పడిన పోలీసుల సంఖ్య 2,416కు చేరింది.  

 

ఇందులో 183 మంది ఆఫీసర్లు ఉండగా, 1238 మంది వివిధ హోదాల్లో ఉన్నారు. గత రెండ్రోజులుగా రోజుకు వందకు పైగా కేసులు బయటపడుతుందడగా.. ఈ రోజు మాత్రం వందకు లోపు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం మహారాష్ట్రలో ఇప్పటివరకు 62,228 కేసులు నమోదు కాగా.. 2,098 మంది మృత్యువాత పడ్డారు.  మహారాష్ట్ర పోలీస్‌ శాఖలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో ఇంతటి విపత్కర పరిస్థితుల్లో విధులు నిర్వర్తిస్తోన్న పోలీసులు వేల సంఖ్యలో వైరస్‌ బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.  

 

చైనాలో పుట్టి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ భారత్ లో కూడా ప్రతాపం చూపిస్తోంది. కరోనాపై యుద్ధం చేస్తున్న డాక్టర్లను కూడా ఈ మహమ్మారి వదలటంలేదు. రోజు రోజుకీ దేశంలో కరోనా పాజిటివ్ కేసులు పెరిగుతూ ప్రజల ఆరోగ్యం కోసం..తమ కుటుంబాలకు కూడా వదిలి అహర్నిశలు కాపలాకాస్తున్న పోలీసుల్ని కూడా కరోనా భూతం వెంటాడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: