లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస  తమ గమ్యస్థానం చేరుకుంటున్నారు.  కరోనా వైరస్ కట్టడికి విధించిన లాక్‌డౌన్ కారణంగా వలస కార్మికులు ఎదుర్కొం టున్న కష్టాలు ప్రతి ఒక్కరినీ కంటితడిపెట్టిస్తున్నాయి. రవాణా సౌకర్యాలు లేకపోవడంతో ఎన్నో కష్టాలు పడ్డారు.  లాక్‌డౌన్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొంటున్న సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం, లోపాలు ఉన్నాయని మంగళవారం వ్యాఖ్యానించింది. పలు ప్రాంతాల్లో చిక్కుకున్న వలస కార్మికులకు తక్షణమే ఆహారం, వసతి, రవాణా సౌకర్యం ఉచితంగా కల్పించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. 

 

అత్యవసర సేవల వైద్య విభాగం అందించిన సమాచారం ప్రకారం మొదటి లాక్ డౌన్ కాలంలో సుమారు 208 మంది మరణించారు.  రైల్వే స్టేషన్లో విధుల్లో ఉండి వలస కార్మికులను అపహస్యం చేసిన ఒక అధికారిని రైల్వే శాఖ సస్పెండ్ చేసింది. ఉత్తర ప్రదేశ్ లోని ఫిరోజాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. రైల్వే స్టేషన్ లో  చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ టికెట్  అధికారిగా  విధులు నిర్వర్తిస్తున్న దీక్షిత్ అనే వ్యక్తి ఈ దారుణానికి పాల్పడ్డాడు. రోడ్డు ప్రమాదాల తర్వాత వేల కిలోమీటర్ల దూరం నడవటం వల్లే మెజార్టీ మరణాలు సంభవించాయి.

 

విపరీతమైన అలసట, నిస్సత్తువ కారణంగా చనిపోయిన వారిలో వృద్ధుల నుంచి యవకుల వరకు అన్ని వయసుల వారు ఉన్నారు. మే 25వ తేదీన వలస కార్మికులతో  నిండిన శ్రామిక్ రైలు ఫిరోజాబాద్ స్టేషన్ నుంచి బయలు దేరటానికి సిధ్ధంగా ఉంది. ఆ సమయంలో దీక్షిత్ తన టీం సభ్యులతో కలిసి కార్మికులను కించపరుస్తున్నట్లుగా....బిస్కట్ ప్యాకెట్లను కిటికీల్లోంచి, గేట్ లోంచి  లోపలికి విసురుతూ, తన పుట్టినరోజు అని, బిస్కట్లు పంచుకుని తినాలని  అపహస్యం చేస్తూ బిస్కట్ పాకెట్లు  ప్రయాణికులపైకి విసిరేశాడు. ఈ తతంగం అంతా  ఫోన్ కెమెరాలో రికార్డు అయ్యింది. అనంతరం ఈ వీడియో వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారు. తర్వాత ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.  దాంతో అధికారులు సీరియస్ అయ్యారు.   అధికారులు దీక్షిత్ పై  వేటు వేశారు. ఈఘటనలో అతని టీం సభ్యులు కూడా సస్పెండ్ అయ్యారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: