దేశంలో రాను రాను మానవత్వం పూర్తిగా నశించి పోతుంది.  నా అన్నవాళ్ల మద్య విభేదాలు రావడం... ఒకరంటే ఒకరికి గిట్టక చంపుకునే పరిస్థితి ఏర్పడుతుంది.   ఈ మద్య కరోనా వచ్చిందని అంత్యక్రియలు చేయడానికి కూడా భయపడిపోతున్నారు.  ఇక కరోనా పేషెట్లను చూడటానికి డాక్టర్లు, నరసులు, ఇతర సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. లాక్ డౌన్ కారణంగా జనాలను బయటకు రాకుండా కాపలా కాస్తూ రక్షణ ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు.   

 

మన చుట్టుపక్కల ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుతున్నారు పారిశుద్ద్య కార్మికులు.  ఇలా దేశమంతా కరోనా వారియర్స్ లా పోరాడుతున్నారు.  అయితే ఇప్పుడు ఆ కరోనా వారియర్స్ కష్టాల్లో ఉంటే కనికరం లేని పరిస్థితి నెలకొంది.  ఆ మద్య డాక్టర్ కి కరోనా వ్యాధి వచ్చి మరణిస్తే.. అంత్యక్రియలకు ఎన్నో ఇబ్బందులు పడ్డారు.  తాజాగా  మధ్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో దారుణం జరిగింది.  మధ్య ప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో కరోనా వైరస్ ధాటికి ప్రజలు ఎంతగా భయపడుతున్నారంటే.. విధి నిర్వహణలో ఉన్న కరోనా వారియర్స్ రోడ్డు మీద స్పృహ తప్పి పడిపోతే  ఏ ఒక్కరూ  పట్టించుకోలేదు.

 

 కరోనా విధుల్లో ఉన్న పారా మెడికల్ సిబ్బందికి సహాయం చేసేందుకు  ఎవ్వరూ ముందుకు రాలేదు.  పీపీఈ కిట్లు ధరించిన పారా మెడికల్ సిబ్బంది  కరోనా రోగులను చికిత్స నిమిత్తం జిల్లాలోని టీవీ ఆస్పత్రి నుంచి  బుందేల్ ఖండ్ మెడికల్ కాలేజీకి తరలించారు.  అనంతరం తిరిగి  ఆస్పత్రికి బయలు దేరారు. ఈ క్రమంలో వారిలో ఒక వ్యక్తి ఉన్నట్లుండి రోడ్డుపై పడిపోయాడు.  అతని సహచరుడు కూడా పట్టించుకోలేదు.. దాదాపు 25 నిమిషాల పాటు ఆ వ్యక్తి రోడ్డుపై అచేతనంగా పడి పోయి ఉన్నాడు.  రోడ్డుపై వెళ్లే వాళ్లు కూడా అలా చూస్తూ వెళ్లారే తప్ప అతడిని  ఆస్పత్రిలోకి తీసుకు వెళ్లేప్రయత్నం చేయలేదు.  తర్వాత సమాచారం అందుకున్న 108 అతన్ని ఆసుపత్రికి తరలించారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: