జగన్ పాలన విషయంలో ఎన్నో అభిప్రాయాలు అందరిలో ఉన్నాయి. ఆయన కనీసం మంత్రిగా కూడా పనిచేయలేదు. ఎలా పాలిస్తారో అని అంతా అనుకున్నారు. మరో వైపు ఆయనకు పాలన చేతకాదు అని టీడీపీ విమర్శలు చేస్తూ వచ్చింది.

 

ఇకోవైపు కాలం కలసిరాక మూడు నెలల నుంచి కరోనా మహమ్మారి రాష్ట్రాన్ని ఇబ్బందుల పాలు చేసింది. ఎన్ని చేసినా కూడా జగన్ సంక్షేమ మంత్రాన్ని విడవలేదు. అదే శ్రీ రామరక్ష అనుకున్నారు. దాన్ని పట్టుదలగా కొనసాగించారు.  దాంతో తొలి ఏడాది పాలనలో జగన్ కు మంచి మార్కులు పడ్డాయి.

 

ముఖ్యంగా జగన్ లో ఎన్నికల హామీలను నెరవేర్చాలన్న పట్టుదల మాత్రం విశ్లేషకులను సైతం ఆకట్టుకుంది. ఇప్పటిదాకా దేశంలో ఎక్కడా ఏ రాజకీయ నాయకుడు అధికారంలోకి వచ్చినా కూడా జగన్ అంత పట్టుదలగా హామీలను నెరవేర్చిన సంఘటనలు లేవు. అది అరుదైన సందర్భంగానే చూస్తున్నారు.

 

జగన్ నవరత్నాలను అమలు చేసిన తీరు దేశానికి ఒక స్పూర్తిగా ఉందని అంటున్నారు. ఇక ఆయన గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు కూడా బాగా మార్కులు వచ్చాయి. అప్పటికి ఉద్యోగాలు లేకుండా ఉన్న యువతను చేరదీసి లక్షల్లో ఉద్యోగాలు ఇవ్వడం అంటే నిజంగా గొప్పగానే చూడాలి. ఈ రెండు విషయాల్లోనూ జగన్ తన సత్తా చాటుకుని మంచి ముఖ్యమంత్రి అనిపించుకున్నారని అంటున్నారు.

 

ఇక ఏడాది కాలంలో ఆయన అనేక కార్యక్రమాలు అమలు చేశారు. నలభై దాకా సంక్షేమ పధకాలు అమలు చేశారు. యాభై వేల కోట్ల రూపాయలను ఇందుకోసం ఖర్చు పెట్టారని తెలిస్తే ఏపీ ఇన్ని ఇబ్బందులో ఉన్నా ఎలా సాధ్యమైందని అనిపించకమానదు. ఇక పొదుపు మంత్రంతో అవినీతి రహిత పాలనను ఏడాది కాలంలో జగన్ చేశారని కూడా కితాబులు వస్తున్నాయి. మొత్తానికి జగన్ పాలన పట్ల సంత్రుప్తి  బాగానే వ్యక్తమవుతోంది. అనుభవం లేకపోయినా అద్భుతంగా పాలించారని అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: