చైనాకు భారత్ తో పోలిస్తే మూడు రెట్లు అధికంగా సైనికబలగం, ఆయుధ సంపత్తి ఉంది. యుద్ధం చేస్తామని హెచ్చరికలు చేసినా నిజంగా యుద్ధం చేయాలని చైనా భావించడం లేదు. చైనా ఈ విధంగా చేయడానికి కొన్ని బలమైన కారణాలు ఉన్నాయని భారత్ సైనిక వర్గాల నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చైనా నుంచి భారత్ కు భారీ సంఖ్యలో కంపెనీలు వస్తాయని వార్తలు రావడం... పీపీఈలు, మందుల కోసం భారత్ పై ఇతర దేశాలు ఆధారపడటం చైనాకు ఆగ్రహం తెప్పించాయి. 
 
మన దేశంతో పాటు ఇతర దేశాలు కూడా చైనా మొదట్లో నాసిరకమైన మాస్కులు పంపించడంతో వాటిని పక్కన పెట్టాయి. ఆ తరువాత భారత్ లో మాస్కుల, పీపీఈల ఉత్పత్తి ప్రారంభించడంతో ప్రపంచంలోనే వీటి ఉత్పత్తిలో భారత్ మూడవ స్థానానికి చేరింది. ఇప్పటికే 10,000 కోట్ల రూపాయల బిజినెస్ వీటి ద్వారా జరపగా బిజినెస్ రోజురోజుకు పెరుగుతోంది. భారతదేశంలో ఒక రోజులో 4,50,000 పీపీఈ కిట్లు తయారవుతున్నాయి. 
 
చైనా నుంచి ప్రధాన పరిశ్రమలు వెళ్లిపోతే దానిపై ఆధారపడిన అనుబంధ సంస్థలు కూడా వెళ్లిపోతాయి. చైనా భారీ స్థాయిలో పరిశ్రమలు భారత్ కు తరలిపోకుండా ఉండాలని భావిస్తున్నట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. యుద్ధం జరిగితే మాత్రం ఆ తరువాత భారత్ తో పాటు చైనా కూడా అదే స్థాయిలో దెబ్బ తింటుంది. యుద్ధంలో భారత్ విజయం సాధిస్తే చైనా కోలుకోవడం అంత సులభం కాదు. 
 
ఒకవేళ యుద్ధం జరిగితే మాత్రం చైనాపై హాంగ్ కాంగ్, తైవాన్ దేశాలు కూడా తిరగబడతాయి. చైనా యుద్ధానికి దిగితే ఆరుముక్కలైనా ఆశ్చర్యపోనవసరం లేదని నిపుణులు చెబుతున్నారు. చైనాకు కూడా ఆ భయం ఉండటం వల్లే దబాయింపుకు పాల్పడినా ఆ పరిధి దాటి మాత్రం ముందుకు రాదు. చైనా యుద్ధానికి దిగితే మాత్రం అది మూడో ప్రపంచ యుద్ధానికే దారి తీస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: