జగన్ జైలు లోకి వెళ్ళిన టైములో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి పార్టీ నుండి మొట్టమొదటిగా రాజీనామా చేసినది గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని. అప్పటి నుండి జగన్ ప్రతి అడుగులో తోడుగా ఉంటూ వైసీపీ పార్టీలో చాలా యాక్టివ్ గా ఉంటూ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా రాణిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాకపోయినా ఎమ్మెల్యేగా గెలిచిన కొడాలి నాని అసెంబ్లీలో మరియు మీడియా సమావేశాలలో తెలుగుదేశం పార్టీకి కౌంటర్లు భారీగా వేస్తూ నేరుగా చంద్రబాబుకి ఆయన కుమారుడు నారా లోకేష్ కి సవాలు వేస్తూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు. అయితే ఇటీవల 2019 ఎన్నికలలో జగన్ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి దక్కించుకున్న కొడాలి నాని మాట్లాడుతున్న భాష అటు రాజకీయాల్లోనూ ఇటు ప్రజలలో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు సమాచారం.

 

 

ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉంటూ కొడాలి నాని మాట్లాడుతున్న తీరు పట్ల సోషల్ మీడియాలో కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇటీవల నారా లోకేష్ 20 కేజీలు బరువు తగ్గడం గురించి కొడాలి నాని మాట్లాడుతూ లాక్ డౌన్ వలన పిజ్జాలు, బర్గర్లు దొరకలేదు.  దీంతో ఏదో పెద్ద బరువు తగ్గినట్టు పప్పు హడావిడి చేస్తున్నాడు అన్ని వ్యాఖ్యలు చేయడంపై అభ్యంతరం వ్యక్తం అవుతున్నాయి.

 

అంతేకాకుండా చంద్రబాబును ఉద్దేశించి దద్దమ్మ అని మాట్లాడటం, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గురించి ఆయన తిరిగి పదవిలో కొనసాగుతారు అంటే... బొచ్చు ఏమన్నా పీకుతాడా..? అన్ని వ్యాఖ్యలు చేయటం పట్ల ఆయన భాషపట్ల తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విధంగా రాబోయే రోజుల్లో కొడాలి నాని వ్యవహరిస్తే జగన్ కి బ్యాడ్ నేమ్ రావడం తప్ప పార్టీకి ఎటువంటి ఉపయోగం ఉండదని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: