2019 ఎన్నికల రిజల్ట్ నాటినుండి చంద్రబాబు కి దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉంది. ఇటీవల జరిగిన మహానాడులో పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు కొంత మంది హాజరు కాకపోవటంతో చంద్రబాబుకి టెన్షన్ పట్టుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా తెలుగుదేశం పార్టీకి ఆయువుపట్టు లాంటి ఉత్తరాంధ్రలో గత ఎన్నికలలో దాదాపు మెజార్టీ స్థానాలు వైసీపీ గెలవడం మనకందరికీ తెలిసిందే. అదే సమయంలో విశాఖపట్నం లాంటి మెగా సిటీ లో తెలుగుదేశం పార్టీ తరఫున నలుగురు ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. అయితే జగన్ ముఖ్యమంత్రి అవటంతో విశాఖపట్టణంలో రాజధాని ఏర్పాటుకు రెడీ అవటంతో ఒక్కసారిగా విశాఖలో రాజకీయ సమీకరణాలు మొత్తం మారిపోయాయి.

 

విశాఖ ప్రాంతంలో ఉన్న రాజకీయ నాయకులంతా వైసిపి పార్టీ వైపు చూస్తున్నారు. దీంతో విశాఖ లో గెలిచిన టిడిపి ఎమ్మెల్యేలు కూడా చాలా వరకు ఇదే వైఖరి అవలంభిస్తున్నారు అన్న టాక్ బలంగా వినబడుతోంది. అందువల్లే పార్టీకి సంబంధించిన కార్యక్రమాల విషయంలో అంత యాక్టివ్ గా కొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొనడం లేదు వాదన టీడీపీ పార్టీ లో వినపడుతోంది. అయితే ఇటీవల జరిగిన మహానాడులో విశాఖపట్టణానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలలో ముగ్గురు హాజరుకాకపోవడంతో చంద్రబాబుకి టెన్షన్ పట్టుకున్నట్లు సమాచారం.

 

ముగ్గురు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా వైసీపీలో చేరుతారనే వార్తలు బలంగా ఏపీ రాజకీయాలలో వినబడుతున్నాయి. అంతేకాకుండా మహానాడు టైం లో వారికీ అధ్యక్షుడు నుండి ఫోన్ లు వచ్చిన రెస్పాండ్ అవ్వలేదని సమాచారం. అందుతున్న సమాచారం ప్రకారం విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అదేవిధంగా గంట శ్రీనివాస్ వీళ్లంతా వైస్సార్సీపీ పార్టీ పెద్దలతో టచ్ ఉన్నట్లు సమాచారం. ఈ పరిణామంతో చంద్రబాబుకి మెయిన్ బెంగ 'మహానాడు' అయిన తర్వాత పట్టుకుందట. ఈ ముగ్గురు జంప్ అయితే తనకి మిగిలి ఉన్న ప్రతిపక్ష హోదా కూడా పోతుందేమో అని తెగ టెన్షన్ పడుతున్నారట.    

మరింత సమాచారం తెలుసుకోండి: