ఒకవైపు తెలుగు రాష్ట్రాలలో కరోనా వైరస్ ప్రభావం రోజురోజుకి పెరిగిపోతున్న తరుణంలో... మరోవైపు దొంగతనాలు, మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా దారుణమైన సంఘటనలు చోటు చేసుకోవడం చాలా బాధాకరమని చెప్పాలి. ఈ తరుణంలో హైదరాబాద్ వాసులకు పోలీస్ శాఖ వారు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ముఖ్యంగా నగరంలో మొబైల్ ఫోన్ స్నాచర్స్ తిరుగుతున్నారని .. ప్రజలు రోడ్ల మీదకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ సీపీ అంజనీ కుమార్ తెలియజేశారు.

IHG


ఇక తాజాగా అబిడ్స్ పరిసరాల ప్రాంతంలో ఒక అమ్మాయి చేతిలో నుంచి బైక్ పై వచ్చి ఇద్దరు దుండగులు మొబైల్ ఫోన్ ని లాకొన్ని అక్కడి నుంచి పరారయ్యారు. దీంతో ఆ మహిళ పోలీసు అధికారులకు సంప్రదించగా.... ఈ ఘటనపై పోలీసులు అధికారులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు మొదలుపెట్టారు.. ఇందులో భాగంగానే సిసి ఫోటేజ్ చెక్ చేయగా... బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు కూడా మొహానికి మాస్క్ లు ఉండడంతో అంతేకాక వారు ఉపయోగించిన బైక్ నెంబర్ ప్లేట్ కూడా సరిగా లేకపోవడంతో... ప్రజలకు పోలీస్ అధికారులు స్నాచర్లను పట్టుకోవడం చాలా కష్టతరంగా మారింది అంటూ తెలియజేశారు.

 


ఇక ఇందులో భాగంగానే నగరంలో ఉన్న అన్ని వాహనాల నెంబర్లు ప్లేట్లను కూడా పోలీసు అధికారులు తనిఖీ చేపట్టారు. అలాగే ఇంగ్లీష్ లెటర్స్ నెంబర్ ప్లేట్స్ లేకున్నా నెంబర్ సరిగ్గా కనపడకపోయినా కూడా.. అలాంటి వారిపై పోలీసు అధికారులు కఠిన చర్యలు తీసుకోవడానికి దానికి సిద్ధమయ్యారు. కనుక హైదరాబాద్ నగర ప్రజలు బయటికి వచ్చినప్పుడు కాస్త మొబైల్స్ జాగ్రత్తగా ఉంచుకోండి అంటూ పోలీస్ అధికారులు ప్రజలకు తెలియజేస్తున్నారు.


 

మరింత సమాచారం తెలుసుకోండి: