ప్రస్తుతం చైనా భారత్ మధ్య పరిస్థితులు రోజురోజుకు ఉద్రిక్త  పరిస్థితులకు దారితీస్తున్న  విషయం తెలిసిందే . సరిహద్దుల్లో  ఎప్పుడు ఏం జరుగుతుందో అని మొత్తం టెన్షన్ టెన్షన్ గా మారిపోయింది. రోజురోజుకు సరిహద్దుల్లో  పరిస్థితి ఉద్రిక్తత వైపు దారి తీస్తుంది. చైనా కు సంబంధించిన చాలా మంది సైనికులు యుద్ధ వాహనంలో  నేరుగా సరస్సు వైపు వచ్చారు. కానీ ప్రస్తుతం చైనా సైనికులు మాత్రం చైనా భారత్ భూభాగం  కాకుండ మధ్యలో నిషేధం  ఉన్న ప్రదేశానికి వచ్చారు. సదరు ప్రదేశంలోకి ఎవరు రాకూడదని నిబంధన ఉన్నప్పటికీ నేరుగా యుద్ధ వాహనాలను తీసుకొని చైనా సైనికులు అక్కడికి వచ్చారు. 

 


 ఒక్కసారిగా వాహనాలను తీసుకుని నిషేధం ఉన్న ప్రదేశంలో కి రావటంతో  భారత సైన్యం అప్రమత్తం అయ్యింది. దీంతో చైనా యుద్ధ వాహనాలపై దాడికి దిగింది భారత సైన్యం. ఈ సందర్భంలో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. అదే సమయంలో చైనా కు సంబంధించిన సైనికులు పైభాగంలో ఉండడం వల్ల అక్కడి నుంచి రాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో భారత సైనికులు ముందుకు దూసుకెళ్లి... సదరు చైనా యుద్ధ వాహనాన్ని అడ్డుకున్నారు. ఆ తర్వాత ఆ వాహనం మీద దాడి చేశారు. దీంతో సరిహద్దులు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

 


 అయితే మొదటి నుంచి సరిహద్దుల్లో గల్లీ ఘర్షణ తరహాలో చైనా సైన్యం వ్యవహరిస్తోంది. కానీ భారత సైన్యం మాత్రం ఎప్పటికప్పుడు తమదైన శైలిలోనే  బుద్ధి చెబుతుంది. అయితే చైనా ఇప్పటివరకూ ఎలాంటి యుద్ధ ఆయుధాలను వాడలేదు.. ఈ నేపథ్యంలో ఇలా చీప్ ట్రిక్స్ ప్లే చూస్తున్నారు చైనా సైనికులు. ఇక భారత సైన్యం ఒక్కసారిగా సదరు చైనా యుద్ధ వాహనంపై దాడి చేయడంతో చైనా కు సంబంధించిన ఒక సైనికుడుని  కూడా పట్టుబడ్డాడు. ఈ క్రమంలోనే సదరు యుద్ధ వాహనాన్ని  కూడా ధ్వంసం చేశారు భారత సైన్యం. అయితే చైనా కొన్ని అంశాలపై భారత్ దృష్టి మరల్చేందుకే ఇలాంటి ట్రిక్స్ ప్లే చేస్తుందని అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి: