2020 ఏడాది అగ్రరాజ్యం అమెరికా దేశాన్ని ఊపిరాడకుండా చేస్తున్నట్లు ఉంది. కరోనా వైరస్ దెబ్బకి చాలా వరకు నష్టపోయింది అమెరికా. ఇటువంటి పరిస్థితుల్లో మరికొద్ది రోజుల్లో దేశంలో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న తరుణంలో 'వర్ణవివక్ష' వివాదం వైరస్ కంటే అత్యంత ప్రమాదకరంగా అగ్ర రాజ్యానికి మారింది. అమెరికా దేశంలో వైట్స్ అండ్ బ్లాక్స్ మధ్య గొడవలు చోటుచేసుకుంటున్నాయి. కారణం చూస్తే జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్ల జాతీయుడి మృతి అని తెలుస్తోంది. తెల్లజాతి పోలీస్ అధికారి తన మోకాళ్ళతో జార్జ్ ఫ్లాయిడ్ మెడపై బలంగా తొక్కిపెట్టి అతని చావుకి కారణం అయ్యారు. ఈ సంఘటనతో అమెరికా మొత్తం గత ఐదు రోజుల నుండి అల్లకల్లోలంగా మారింది.

IHG

జార్జ్ ఫ్లాయిడ్ ని తొక్కిపెట్టిన పోలీసు వీడియో ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో జార్జ్ ఫ్లాయిడ్ ఊపిరి తీసుకోవడానికి కష్టంగా ఉంది వదిలేయండి అంటున్నా పోలీసులు దయ దాక్షిణ్యం లేకుండా వ్యవహరించడంతో మరింత అలజడికి కారణం అయింది. ఈ సంఘటనతో గత ఐదు రోజులుగా అమెరికాలో నిరసనలు తీవ్ర స్థాయిలో జరుగుతున్నాయి. ప్రజలంతా రోడ్ల మీదకు వచ్చి నిరసనలు చేపడుతూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. అంతే కాకుండా కొన్ని నగరాల్లో అయితే పోలీసులపై రాళ్లు రువ్వుతున్నారు.

IHG

మినియాపోలీస్ లో పోలిస్ స్టేషన్ ను తగులబెట్టారు. అట్లాంటాలో నేషనల్ గార్డ్స్ ను రంగంలోకి దించినా ప్రయోజనం లేకపోతోంది. డెట్రాయిట్ లో పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ 19ఏళ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో పరిస్థితి మరింత అదుపు తప్పింది. ఘటనకు కారణమైన పోలీస్ ఆఫీసర్ ని సస్పెండ్ చేసిన గాని ప్రజలు శాంతించడం లేదు. మొత్తంమీద అమెరికాలో పరిస్థితి చూస్తే కరోనా వైరస్ కంటే వర్ణ వివక్షత మరింత ప్రమాదకరంగా మారింది. చాలాచోట్ల ‘మాకు ఊపిరి ఆడటం లేదు.. రేపు నేనే కావొచ్చు’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: