ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం జగన్ సర్కార్, నిమ్మగడ్డల మధ్య వివాదం పతాకస్థాయికి చేరింది. నిమ్మగడ్డ వ్యవహారంలో ఎన్నో ట్విస్ట్ లు చోటు చేసుకుంటున్నాయి. జగన్ సర్కార్ తరపు న్యాయవాదులు, నిమ్మగడ్డ తరపు న్యాయవాదులు పొంతన లేని వ్యాఖ్యలు చేస్తూ ఉండటంతో గందరళగోళం నెలకొంది. నిమ్మగడ్డ వ్యవహారంలో ట్విస్ట్ లకు ఆయన చేసిన తప్పే కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
నిమ్మగడ్డ రమేష్ కేసులో ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం వాస్తవమే. హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే నిమ్మగడ్డ తనకు తానుగా బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించుకున్నారు. దీనిపై అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ అభ్యంతరం చెప్పడంతో ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు వెనక్కు తీసుకుంది. హైకోర్టు తీర్పులోని 317 పేరాలో ఆర్డినెన్స్ ఆధారంగా జారీ చేసిన జీవోలు అమలు కావని... కోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ తిరిగి పదవి పొందుతాడని పేర్కొంది. 
 
318 పేరాలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ కు బాధ్యతలు అప్పజెప్పాలని పేర్కొంది. నిమ్మగడ్డ రమేష్ కు బాధ్యతలు వచ్చేలా చేయాలని హైకోర్టు ఆయనను ఆదేశించింది. నిమ్మగడ్డ రమేష్ తనకు తాను బాధ్యతలు తీసుకోవడం చట్టవిరుద్ధమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేసమయంలో తీర్పు వ్యతిరేకంగా వచ్చినా వారికి రాజ్యాంగపరమైన హక్కులు ఉంటాయి. 
 
న్యాయ సూత్రాల ప్రకారం గెలిచిన నిమ్మగడ్డకు ఎన్ని హక్కులు ఉంటాయో... ఓడిన రాష్ట్రప్రభుత్వానికి కూడా అన్నే హక్కులు ఉంటాయి. నిమ్మగడ్డ తనకు తాను బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించడం సహజ న్యాయసూత్రాల ప్రకారం తప్పే. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వెళ్లకూడదనుకుంటే ఆ తీర్పు ఫైనల్ అవుతుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకు వెళతామని ప్రకటించడంతో న్యాయపరమైన తుదితీర్పు కోసం ఎదురుచూడాల్సిందే. నిమ్మగడ్డ తనను తాను బాధ్యతలు చేపట్టినట్టు ప్రకటించడమే తప్పు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: