ఏపీ రాజకీయవర్గాల్లో ప్రస్తుతం నిమ్మగడ్డ వ్యవహారం గురించే ప్రధానంగా చర్చ జరుగుతోంది. తనకు తాను ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడంతో ఇప్పటికే నిమ్మగడ్డ తప్పు చేశాడనే అభిప్రాయాలు రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. నిమ్మగడ్డ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిమ్మగడ్డ చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఆయన మరో తప్పు చేస్తున్నాడనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 
 
ప్రభుత్వ తరపు అడ్వకేట్ జనరల్ చేసిన వ్యాఖ్యల అనంతరం కూడా నిమ్మగడ్డ తీరులో మార్పు రావడం లేదు. నిమ్మగడ్డ హైకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ తానేనని చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు తీర్పును ఉల్లంఘిస్తోందని వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్ స్వయంప్రతిపత్తి, సమగ్రతను దెబ్బ తీసేలా ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నాయని చెప్పారు. ఆర్డినెన్స్ తో పాటు కనగరాజ్ నియామకం కోసం జారీ చేసిన ఉత్తర్వులను కొట్టివేసిందని తెలిపారు. 
 
కోర్టు 307వ పేరాలో తనను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా కొనసాగించాలని కోర్టు పేర్కొందని చెప్పారు. 2021 మార్చి 31 వరకు(పదవీకాలం పూర్తయ్యే వరకు) కోర్టు ఆ పదవిలో కొనసాగించాలని ఆదేశించిందన్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్ రద్దు కావడంతో తాను ఆ పదవిలో ఉన్నట్లేనని.... తీర్పు ప్రకారం చార్జ్ తీసుకున్నట్లు సమాచారం ఇచ్చానని తెలిపారు. హైకోర్టు ఆదేశాలను మీడియా సమావేశం ఏర్పాటు చేసి అడ్వకేట్ జనరల్ చే చెప్పించడం అసమంజసంగా ఉందని పేర్కొన్నారు. 
 
అయితే నిమ్మగడ్డ చేస్తున్న వ్యాఖ్యల వల్ల ఆయన మరో తప్పు చేస్తున్నాడని విశ్లేషకులు చెబుతున్నారు. కోర్టు తీర్పులోని 318 పేరా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ ను తిరిగి నియమించాల్సి ఉంటుందని.... నిమ్మగడ్డ అడ్వకేట్ జనరల్ వివరణ తర్వాత కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడుతున్నారు. జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించనుండటంతో సుప్రీం ఈ కేసు విషయంలో ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: