ప్రపంచంలోకి కరోనా దొంగలా వచ్చింది ఇప్పుడు దొరలా మారింది.. కరోనా అంటే గత కొన్ని నెలల క్రితం భయపడిన ప్రజలు క్రమక్రమంగా ఈ వైరస్‌తో బ్రతకడానికి అలవాటు పడుతున్నారు.. ఇక ఈ వైరస్ వల్ల ప్రపంచమే నిశబ్ధంగా మారింది.. అంటే కొన్ని నెలలు లాక్‌డౌన్ పేరిట అంధకారంలోకి వెళ్ళిపోయింది.. అయినా ఈ కరోనా గాడికి కడుపు నిండనట్లుగా ఉంది.. అందుకే ఎవరిని విడిచిపెట్టి పోయేది లేదని భీష్మించుకు కూర్చున్నాడు.. ఇప్పటికే దాదాపు అన్నిదేశాల్లో లాక్‌డౌన్ ప్రకటించడంతో పేద మధ్యతరగతి ప్రజలు పడే ఇబ్బందులు అన్నీఇన్నీ కావు.. ఇప్పుడిప్పుడే అక్కడక్కడ లాక్‌డౌన్ సడలింపులు జరుగుతున్నాయి..

 

 

ఇకపోతే అన్ని వర్గాల వ్యాపారులు ఈ వైరస్ వల్ల నష్టపోతుంటే కెన్యాలోని క్షురకులు మాత్రం కరోనా నమూనానే వ్యాపరంగా మార్చుకుని పొట్ట నింపుకుంటున్నారట. అదేలా అని ఆశ్ఛర్య పోతున్నారా, అయితే వినండి. ఈ కరోనా వైరస్‌ ఆఫ్రికా ఖండం లోని కెన్యా దేశంలో విసృతంగా విజృంభిస్తోంది. దీని వల్ల అక్కడ కూడా లాక్‌డౌన్‌ విధించడంతో క్షౌరశాలలకు ప్రజల రాక తగ్గిపోయింది. ఈ సమయంలో జీవనోపాధి ముఖ్యం కాబట్టి కిబెరా ప్రాంతానికి చెందిన క్షురకులు ఒక వినూత్న ఆలోచన చేశారట. ఈ క్రమంలోనే వారి ఆలోచనల నుండి ఓ కొత్తరకం హెయిర్ స్టైల్ పుట్టింది..

 

 

కరోనా వైరస్‌ ఆకృతినే స్ఫూర్తిగా తీసుకొని కరోనాకు ఉండే కొమ్ములు మాదిరిగా జుట్టును ముళ్లు వేసి ఈ ‌స్టైల్‌ను రూపొందించారు. ముందే ఆఫ్రికా వాసులు జుట్టును ముళ్లు ముళ్లుగా వేసి చిత్రవిచిత్రంగా హెయిర్‌స్టైల్‌ చేస్తుంటారు. దీంతో కరోనా కొమ్ముల స్టైల్‌ వారికి తెగ నచ్చడమే కాకుండా, ఇది దేశవ్యాప్తంగా ఫ్యాషన్‌గా మారిపోయిందట. ఇక ఈ హెయిర్‌స్టైల్‌ ధర కూడా అన్నింటికి కంటే తక్కువగా ఉండటంతో సెలూన్‌ల వద్ద ప్రజలు క్యూ కూడా కడుతున్నారట.ఇక కరోనా ప్రజలతో ఒక ఆట ఆడుకుంటుంటే కెన్యా క్షురకులు మాత్రం కరోనానే తమ బిజినెస్ సింబల్‌గా మార్చుకున్నారు.. ఇక నెటిజన్స్ అయితే వీరి తెలివికి ముచ్చటపడుతున్నారట..  

మరింత సమాచారం తెలుసుకోండి: