లాక్ డౌన్ కారణంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనాలు రద్దయ్యాయి. నిత్యపూజలు, క్రతువులు జరుగుతున్నా.. భక్తులకు దర్శనం లేదు. తిరుపతి ఏడుకొండల వాడిని దర్శించుకోకుండా తెలుగు ప్రజలు ఎక్కువ కాలం ఉండలేరు. అంతటి భక్తి ఆయన అంటే. అయితే లాక్ డౌన్ కాలం కాబట్టి నిబంధనలు పాటించక తప్పదు. అయితే వెంకన్న దర్శనం ఎంత ఆనందదాయకమో.. ఆయన లడ్డూ ప్రసాదాన్ని కూడా భక్తులు అంతే భక్తిప్రపత్తులతో ఆరగిస్తారు.

 

 

తిరుపతి లడ్డూను భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. అందుకే ఎవరు తిరుపతి వెళ్లినా.. ఇంటి దగ్గర పంచేందుకు లడ్డూలు తెచ్చుకుంటారు. తిరుపతి ప్రసాదం పంచడం ఓ గౌరవం కూడా. ఈ కరోనా లాక్ డౌన్ కాలంలో భక్తులకు ఆ లడ్డూను పంపిణీ చేయాలని ఇటీవల టీటీడీ భావించింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న తన కార్యాలయాల్లో లడ్డూని అమ్మకానికి ఉంచింది. అయితే దారుణమైన విషయం ఏంటంటే.. ఇప్పుడు ఈ నిర్ణయాన్ని సైతం ప్రతిపక్ష టీడీపీ రాజకీయం చేస్తుంది.. అయ్యో స్వామి వారి ప్రసాదాన్ని కూడా వ్యాపారం చేస్తారా అంటూ దుమ్మెత్తి పోస్తోంది.

 

 

ప్రతిపక్షం కాబట్టి ప్రభుత్వం తీసుకున్న ప్రతి నిర్ణయాన్ని వ్యతిరేకించాలన్నట్టు ఈ విషయంలో టీడీపీ భావించడం దారుణం. కష్టకాలంలో శ్రీవారిని దర్శించకపోయినా.. కనీసం లడ్డూ ప్రసాదమైన అందుకుని ఆ స్వామివారిని దర్శించుకున్న అనుభూతి పొందే భాగ్యం భక్తులకు దక్కకుండా చేయడమేంటన్న విమర్శలు భక్తుల నుంచి వస్తున్నాయి. అంతే కాదు... టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు ఏమన్నారంటే.. దీనిపై స్వామీజీలు స్పందించాలట. ఈ దారుణం ఆపాలట.

 

 

అయితే ఆయన ఆశించినట్టే.. ఓ స్వామీజీ స్పందించారు. అయితే ఆయన టీటీడీ చర్యను సమర్థించారు. భక్తులకు తిరుమల లడ్డూలు ఇస్తున్న దానిపై విమర్శలు సరికాదని విశాఖ శ్రీశారదా పీఠం ఉత్తరాధికారి స్వామి స్వాత్మానందేంద్ర సరస్వతి వ్యాఖ్యానించారు. శ్రీవారి అనుగ్రహం, ఆశీస్సులు ఈ లడ్డూల రూపేణా లభిస్తున్నట్టు భావించాలని ఆయన సూచించారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: