ఆంధ్రప్రదేశ్ లో ఏపీ సర్కారుకు వరసగా కోర్టుల్లో ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే దాదాపు 64 సార్లు హైకోర్టు వైసీపీని మొట్టికాయలు వేసిందని విపక్షం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు న్యాయమూర్తులపై సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయడం.. దానిపై ఓ న్యాయవాది కోర్టుకు వెళ్లడం.. కోర్టు వారికి నోటీసులు ఇవ్వడం కూడా జరిగిపోయాయి. అయితే ఇప్పుడు అదే అంశంపై ఓ కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలు ఆసక్తిరేపుతున్నాయి.

 

 

ఎన్నికలలో ఓడిపోయిన ప్రతిపక్ష పార్టీలు కోర్టులను అడ్డం పెట్టుకుని రాజకీయాలను నియంత్రించరాదని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ కామెంట్ చేయడం సమకాలీన రాజకీయాల్లో చర్చకు దారి తీస్తోంది. విపక్షాలు కోర్టుల ద్వారా ప్రభుత్వాన్ని నియంత్రించే ప్రయత్నం జరుగుతోందన్న ఆరోపణ ఈ మాటల్లో కనిపిస్తోంది. ఇది ఆయన కేంద్రంలోని విపక్షాలను ఉద్దేశించి చేసి ఉండొచ్చు.

 

 

కానీ ఈ మాటలు ప్రస్తుత ఏపీ రాజకీయాలకు అచ్చుగుద్దినట్టు సరిపోతున్నాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కూడా ఇదే తరహాలో వ్యాఖ్యానించారట. ఆయన ఏకంగా.. దేశంలోని హైకోర్టులు సమాంతర ప్రభుత్వం నడుపుతున్నా’యని కా మెంట్ చేశారట. ఈ కామెంట్లపై ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, కేంద్ర న్యాయశాఖ మాజీ మంత్రి కపిల్‌ సిబల్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అహంకార పూరితంగా వ్యవహరిస్తోందనడానికి ఇది ఉదాహరణ అన్నారట.

 

 

మొత్తం మీద ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ న్యాయ వ్యవస్థ పనితీరుపై చర్చ నడుస్తోంది. ప్రజాస్వామ్యంలో చర్చ ఎప్పుడూ స్వాగతించదగిందే. కానీ దురుద్దేశాలతో కూడిన వ్యాఖ్యలే అభిలషణీయం కాదు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: