గత నెల క్రితం వరకు గుట్టుగా వ్యాపించిన కరోనా ఇప్పుడు మరింతగా రెచ్చిపోతుంది.. ఒక రాష్ట్రం అని ఏమి లేదు.. ప్రస్తుతం అన్ని రాష్ట్రాల్లో కేసులు పెరుగుతూనే ఉన్నాయంటున్నారు వైద్యనిపుణులు.. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా అరకోటి పూర్తి చేసుకుని, కోటి దాటడానికి పరుగులు పెడుతున్న ఈ వైరస్ ప్రతి ఇంటిలో కుటుంబ సభ్యునిగా మారుతుంది.. ఇక దీని బారిన ప్రజలే కాదు అధికారులు, రాజకీయ నాయకులు కూడ పడుతున్నారు.. ప్రజలకు రక్షణగా నిలవ వలసిన వారే ఇలా ఈ వైరస్ బారిన పడుతుండటంతో సామాన్య ప్రజల్లో ఆందోళనెలకొంటుంది..

 

 

ఇకపోతే తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి సత్పాల్ మహారాజ్, అతని భార్య అమృతా రావత్, మరో 17 మంది కుటుంబసభ్యులు, సిబ్బందికి కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలిసిందే.. దీంతో మంత్రితో పాటు అతని కుటుంబ సభ్యులను డెహ్రాడూన్ నగరంలోని సొంత ఇంట్లో క్వారంటైన్ చేశారు. అంతే కాకుండా మంత్రి ఇంట్లో పనిచేస్తున్న 17 మంది సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకడంతో వీరందరిని క్వారంటైన్ కు తరలించారు.

 

 

ఇక ఉత్తరాఖండ్ సీఎం త్రివేండ్ర సింగ్ రావత్ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కరోనా సోకిన మంత్రి సత్పాల్ మహారాజ్ శుక్రవారం పాల్గొనడంతో, సీఎం త్రివేండ్ర సింగ్ రావత్ తోపాటు మంత్రులందరినీ హోంక్వారంటైన్ చేసినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ అధికార ప్రతినిధి జేసీ పాండే చెప్పారు. ఇకపోతే వైరస్ ఇంతలా వ్యాపిస్తున్నా, ఇప్పటికి కూడా కొందరు అధికారుల్లో చలనం రావడం లేదని నెటిజన్స్ విమర్శిస్తున్నారు. డబ్బు, పలుకుబడి ఉన్న వారే ఇలా కరోనా బారినపడుతుండగా ఇక సామాన్యుల పరిస్దితి ఏంటని ప్రశ్నిస్తున్నారు..

 

 

ఏది ఏమైనా మళ్లీ వేసవి వచ్చేవరకు, లేదా ఈ వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చేవరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతక వలసిన పరిస్దితులు తలెత్తాయి.. కరోనా పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఎదుర్కోబోయే సమస్యను విశ్లేషించడం అసాధ్యం అని అంటున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: