న్యూస్ ఛానళ్లు అంటే ఎంత సేపూ.. విసుగుపుట్టించే వార్తలే కదా అనిపించే రోజుల్లోనే అవే వార్తలను వెరైటీగా ఓ స్పెషల్ క్యారెక్టర్ తో ప్రజంట్ చేసే ఒరవడికి వీ6 న్యూస్ ఛానల్ శ్రీకారం చుట్టింది. మల్లన్న, రాములమ్మ అంటూ మొదట రెండు క్యారెక్టర్లను డిజైన్ చేసి తీన్మార్ వార్తల ద్వారా సంచలనం సృష్టించింది. ఈ తీన్మార్ వార్తలు ఎంత ఫేమస్ అయ్యాయంటే.. వీ6 మొత్తం రేటింగ్‌లో ఒక్కోసారి ఈ ఒక్క బులెటిన్ సగం పాయింట్లు సాధించేది.

 

 

ఆ తర్వాత మల్లన్న మానేయడంతో చేవెళ్ల రవి అనే ఆర్టిస్టును బిత్తిరి సత్తి క్యారెక్టర్ గా డిజైన్ చేసి సూపర్ సక్సస్ సాధించింది. రాములమ్మ వెళ్లిపోతే.. ఆమె స్థానంలో సావిత్రిని తీసుకొచ్చింది. ఇక సావిత్రి, బిత్తిరి సత్తి క్యారెక్టర్స్ అయితే తెలంగాణలో ప్రతి ఇంట్లోనూ సభ్యులైపోయేంతగా ఆ ప్రోగ్రామ్ సూపర్ హిట్ట అయ్యింది. ఇప్పుడు దాదాపు ప్రతి తెలుగు న్యూస్ ఛానల్ కూడా తీన్మార్ వార్తల తరహాలో ఓ అరగంట ప్రోగ్రామ్ డిజైన్ చేశాయంటే అది తీన్మార్ వార్తల ప్రభావమే.

 

 

అయితే అనూహ్యంగా బిత్తిరి సత్తి, సావిత్రి ఇద్దరూ కాస్త తేడాతో వీ6కు దూరం కావడంతో మళ్లీ కొత్త పాత్రల రూపకల్పనపై వీ6 దృష్టి సారించింది. ప్రస్తుతానికి పద్మ అనే క్యారెక్టర్ ను రాధ అనే క్యారెక్టర్లతో బాగానే న్యూస్ ప్రజంట్ చేస్తూ తీన్మార్ వార్తల సత్తాను నిలబెడుతోంది. అయితే ఇప్పుడు మరింత ప్రభావవంతంగా ఉండేందుకు మరో కొత్త క్యారెక్టర్ ను రంగంలోకి దింపుతోంది వీ6 న్యూస్ ఛానల్. ఆ క్యారెక్టరే సదన్న.

 

 

తెలంగాణ యాసలో యూట్యూబ్ లో సదన్న చేసే కామెడీ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు ఆ క్యారెక్టర్ సత్తాను బుల్లితెరపై చాటేందుకు వీ6 ప్రయత్నం ప్రారంభించింది. రాధ- సదన్న పాత్రల మధ్య కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యేలా కనిపిస్తోంది. సదన్న రోజూ తీన్మార్ వార్తల్లో సందడి చేస్తున్నాడు. మరి ఈ సదన్న బిత్తిరి సత్తి రేంజ్‌ లో సక్సస్ అవుతాడా లేదా అన్నది మరికొద్ది రోజుల్లో తేలుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: