పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజలు అభిమానంతో ఊగి పోతారు అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అతన్ని చూడడానికి ఎంతో మంది తరలిరావడం అప్పట్లో సామాన్య ప్రజలను, సెలబ్రిటీలను సైతం ఆశ్చర్యపరిచింది. అయితే ఈ పాపులారిటీ ప్రజాదరణ కేవలం రీల్ హీరో పవన్ కళ్యాణ్ కి మాత్రమే. రాజకీయంగా తనకు ఓట్లు వేయడానికి ఎవరు ఆసక్తి చూపకపోవడం అందరి విస్మయానికి కారణమవుతుంది. తాను పొలిటికల్ మెటీరియల్ కాదని ప్రజలు ఓట్లతో గట్టిగా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ తన ఓటమిని మాత్రం ఒప్పుకోవడం లేదు. సినిమాలో అసలు నటించనని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మాత్రం సినిమాల ద్వారా డబ్బులు బాగా సంపాదించి తన పార్టీ అభివృద్ధి చేసి ఓట్లు దండుకోవాలని చూస్తున్నాడు. 


వాస్తవానికి ఆంధ్ర ప్రదేశ్ లో వైయస్సార్సీపి పార్టీకి మరే ఇతర పార్టీ పోటీ ఇస్తుందని అనుకోవడం పొరపాటే. 151 సీట్లు గెలుచుకొని భారీ విజయం పొందిన వైఎస్ఆర్సిపి పార్టీ కేవలం ఏడాది కాలంలోనే ఎన్నో సంక్షేమ పథకాలను ప్రజల కోసం ప్రవేశపెట్టింది. రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు కూడా అడ్డుకట్ట వేసింది. ఒకటో రెండో నిర్ణయాలు ప్రజలకు కాస్త ఆగ్రహం తెప్పింనప్పటికీ మిగతా అన్ని విషయాల్లో జగన్ ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తుందని చెప్పుకోవచ్చు. 


అటువంటి విపరీతంగా ప్రజాదరణ పొందిన పార్టీపై పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన గెలవడం దాదాపు అసాధ్యం. ఒకవేళ పవన్ కళ్యాణ్ తెలంగాణ రాష్ట్రంలో పోటీ చేయాలనుకున్నా... కెసిఆర్ పార్టీ అయిన టీఆర్ఎస్ పై గెలవగలడా అంటే దానికి సమాధానం నో అని చెప్పవచ్చు. తెలంగాణ తెచ్చిన కేసీఆర్... ఆ రాష్ట్రాన్నే తన సొంతం చేసుకొని శాసిస్తున్నాడు. అతడి రాజకీయ వ్యూహాలను ముందు అసలు రాజకీయ పరిజ్ఞానం లేని పవన్ కళ్యాణ్ గెలవగలడా అని ప్రశ్నించుకోవడం హాస్యాస్పదం గా పరిగణించవచ్చు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి పదవిని అధిరోహించాలంటే ఒక మిరాకిల్ జరగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: