టీడీపీ ఆది నుంచి న‌మ్ముకున్న బీసీ ఓటు బ్యాంకుకు బూజు ప‌డుతోందా అంటే..ఔననే హెచ్చ‌రిస్తున్నా రు ప‌రిశీల‌కులు. ప్ర‌స్తుతం పార్టీ ప‌రిస్థితి దారుణంగా ఉంద‌ని, ఈ క్ర‌మంలో బీసీలే త‌మ‌కు అండ‌గా నిలు స్తార‌ని, ఇటీవ‌ల చంద్ర‌బాబు పెద్ద ఎత్తున గ‌ళం వినిపించారు. ఆది నుంచి తాము బీసీల‌కు ప్రాధాన్యం ఇ స్తున్నామ‌ని కూడా బాబు చెప్పుకొచ్చారు. నిజానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ బీసీల‌ను నమ్ము కున్నారు. అనేక కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. అయితే, బీసీ ఓటు బ్యాంకుకు పార్టీ దూర‌మైంది.

 

దీంతో పార్టీ ఘోరంగా ఓట‌మి పాలైంది. ఇక‌, ఇప్పుడు కూడా పార్టీ ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఈ నే ప‌థ్యంలో ఉన్న కొద్దిమంది బీసీ నాయ‌కులు కూడా పార్టీ నుంచి జంప్ చేస్తే.. ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌శ్న ‌గా మారింది. ఇప్పుడు ఇదే ప్ర‌శ్న గుంటూరు జిల్లాలో హాట్ హాట్‌గా మారింది. గుంటూరు నుంచి నెగ్గిన ఏకైక బీసీ ఎమ్మెల్యేగా గుర్తింపు తెచ్చుకున్నారు రేప‌ల్లె ప్ర‌జాప్ర‌తినిధి అన‌గాని స‌త్య ప్ర‌సాద్‌. నిజానికి గుంటూరు నుంచి ఇద్ద‌రు ఎమ్మెల్యేలు విజ‌యం సాధించారు. ఒక‌రు గుంటూరు ప‌శ్చిమం నుంచి మ‌ద్దాలి గిరి. అయితే, ఈయ‌న ఇప్ప‌టికే వైసీపీకి అనుకూలంగా మారిపోయారు.

 

ఇక‌,.. ఇప్పుడు అన‌గాని స‌త్య ప్ర‌సాద్ వంతు వ‌చ్చింద‌నే ప్ర‌చారం సాగుతోంది. టీడీపీ సైకిల్ దిగేసేందు కు అన‌గాని ప్ర‌య‌త్నిస్తున్నారని, ఇప్ప‌టికే వైసీపీలో దీనిపై మంత‌నాలు కూడా సాగిపోయాయ‌ని అంటు న్నారు. గౌడ సామాజిక వ‌ర్గానికి చెందిన అన‌గానికి రేప‌ల్లెలో మంచి ప‌ట్టుంది. వ‌రుస‌గా విజ‌యాలు కూడా సాధించారు. అయితే, ఇప్పుడు ఈయ‌న వైసీపీలోకి మారిపోతున్నార‌నే వార్త‌లు రావ‌డం, అది కూడా చంద్ర‌బాబు అనుకూల మీడియాలో ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో బీసీ వ‌ర్గాలు ఇక‌పై చంద్ర‌బాబుకు దూర‌మ ‌వుతున్నాయా ? అనే ప్ర‌చారం సాగుతోంది. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి. ఏదేమైనా ఏపీలో రాజ‌కీయం మాత్రం రంజుగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: