తెలివి, ఆలోచనతత్వం, కష్టపడతాను ఈ మూడు ఉంటే ఎంతటి అసాధ్యం కూడా సుసాధ్యం చేసే రోజులు ఇవి. తెలంగాణ రాష్ట్రంలోని నారాయణపేట జిల్లాకు చెందిన గట్టు అనిల్ ఇది చేసి నిరూపించాడు. కంప్యూటర్ సైన్స్ లో Phd చేసి, బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చి కూడా తన తల్లి ఒక్కదాన్ని ఊరిలో వదిలి వెల్ల లేక ఆ ఉద్యోగాన్ని వదులుకొని మరి వ్యవసాయంపై దృష్టి పెట్టాడు అనిల్. తనకు ఉన్న 7 ఎకరాల్లో బోరుబావి వేయించి మొదట కందులు, జొన్న మొదలగు వ్యాపార వాణిజ్య పంటలను వేసి చూశాడు. దానితో వారు ఆశించినంతగా ఫలితం రాకపోవడంతో  కూరగాయలు పూలతోటలు పై దృష్టి సారించాడు.

 


తనకు అనుకూలంగా ఉన్న నీటి వనరులను సరైన విధానంలో వాడుకుంటూ కేవలం ఒకటిన్నర ఎకరా భూమిలో సేంద్రియ మొక్కలు సాగుచేశారు. నిజానికి ఈ సంవత్సరం పొడవునా కూరగాయలు పండిస్తున్నారు. కేవలం సేంద్రీయ ఎరువులతో మంచి దిగుబడి ఇచ్చే దొండకాయ, బెండకాయ, కాకరకాయ, బీరకాయ, చిక్కుడు, పచ్చిమిర్చి, గోరుచిక్కుడు, గుమ్మడి ఇలా అనేక కూరగాయలతో పాటు శుభకార్యాలలో ఉపయోగించే బంతి పూలు, జర్మనీ పూలు ఆయన సాగు చేస్తున్నారు. ఇక అడవి జంతువుల నుంచి పంటల రక్షణ కోసం గాలితో మోగే బెల్ ను అనిల్ రూపొందించాడు. ఇది అతని చదువుకు తార్కాణమని చెప్పవచ్చు.

 

జిల్లా కేంద్రానికి సమీపంలో సేంద్రీయ పద్ధతిలో కూరగాయలు పండించడంతో వాటిని కొనుగోలు చేసేందుకు ప్రజలు సరాసరి వచ్చి కొనుగోలు చేస్తున్నారు. అలా అమ్ముడుపోయిన మిగిలిన వాటిని తన ఇంటి దగ్గర పెట్టి విక్రయిస్తున్నారు. దీంతో ఆయనకు ప్రతిరోజు కూరగాయల ద్వారా రెండు నుంచి మూడు వేల రూపాయలు లాభాలను గడిస్తున్నారు. ఒకవైపు కూరగాయలు, ఒకవైపు పూలు అమ్మకాల ద్వారా మంచి ఆదాయం అనిల్ కు లభిస్తుంది. సంవత్సరం పొడవునా అన్ని ఖర్చులు పోనీ 12 నుంచి 15 లక్షల లాభం వస్తుందని అతను తెలుపుతున్నాడు. అంతేకాకుండా తనకు సంబంధిత అధికారులు సలహాలు సూచనలు అందిస్తున్నారని అనిల్ తెలిపాడు. ఎటువంటి క్రిమిసంహారక మందులు వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు జిల్లావ్యాప్తంగా వాటిని అమ్మాలనే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నాం అని తెలిపాడు. తను అంత చదువుకోవడం వృధా కాకుండా జిల్లా కేంద్రంలోని డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ గా పని చేస్తున్నాడు అని కూడా తెలిపాడు. ఇక ఈ సంవత్సరం ఈ సాగును మరింత పెంచడానికి ప్రయత్నిస్తానని తెలుపుతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: