అనంతపురం తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో జగన్ మోడీ కి తప్ప ఎవరికి భయపడరు అని అన్నారు. SEC  విషయంలో ప్రభుత్వం కోర్టుకు వెళ్లడంతో తప్పు లేదని పేర్కొన్నారు. అదే విధంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ని కొనసాగించడం తప్పు కాదని అన్నారు. కోర్టులు ఎన్ని సార్లు చెప్పిన సీఎం జగన్ వినరని దున్నపోతు మీద వర్షం పడినట్లే అని అభివర్ణించారు. అంతేకాకుండా 151 మంది ఎమ్మెల్యేలు ఉంటే నేనే రాజు నేనే మంత్రి అనుకోవటం, ఆ విధంగా వ్యవహరించడం చాలా తప్పు అని జగన్ వ్యవహరిస్తున్న శైలి పై మండిపడ్డారు.

IHG

జగన్ ఏడాది పరిపాలనపై చదువుకున్న వారికి బాగా అర్థమైందని రాబోయే రోజుల్లో కింది స్థాయిలో ఉన్న కార్యకర్తలకు కూడా అర్థమవుతోందని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా జగన్ ఏడాది పాలనకు 110 మార్కులు వేస్తానని జేసి దివాకర్ రెడ్డి సెటైర్లు వేశారు. కీర్తిశేషులు నీలం సంజీవరెడ్డి మహోన్నతమైన వ్యక్తి అని ఆయన తీసుకున్న తప్పుడు నిర్ణయానికి రాజీనామా చేశారని అన్నారు. అలాంటి రాజకీయాలు చూసిన నేను ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు చూసి అసలు రాజకీయాల్లో ఎందుకు ఉన్నామా అని బాధపడుతున్నాను అని జేసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

IHG

నీతి లేదు నియమము లేదు నేనే రాజు నేనే మంత్రి అన్నట్టుగా మొత్తం నేనే అన్నట్టు జగన్ వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. ప్రజలు మెజారిటీ ఇచ్చిన రాజ్యాంగబద్ధంగా రాష్ట్రాన్ని పరిపాలించాలని జగన్ కి జేసీ దివాకర్ రెడ్డి సూచించారు. జగన్ దేశంలో ఎవరి మాట వినడు అని ప్రధానమంత్రి మోడీ ఏమైనా చేస్తాడేమో అన్న భయంతో ఆయన మాట తప్ప ఇంకా ఎవరి మాట వినడు అంటూ షాకింగ్ కామెంట్లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: