దేశంలో కరోనా వైరస్  కట్టడి చేయడం కోసం కేంద్రం తీసుకున్న లాక్ డౌన్ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా ఆలయాలు మూతబడ్డ విషయం అందరికీ తెలిసిందే. వైరస్ ఎక్కువగా గుంపులుగుంపులుగా ఉండే చోట వ్యాప్తి చెందే అవకాశం ఉండటంతో కేంద్రం తీసుకున్న నిర్ణయానికి దేశవ్యాప్తంగా అన్ని విశ్వాసాలకు చెందిన గుళ్ళూ, గోపురాలు, మసీదులు, చర్చిలు మార్చి నెలాఖరు నుండి క్లోజ్ అవ్వడం జరిగింది.

IHG

అయితే ఇటీవల ఐదో దశ లాక్ డౌన్ కొనసాగింపు విషయంలో మార్గదర్శకాలు కేంద్రం విడుదల చేస్తూ గుళ్ళూ గోపురాలు అన్ని మత విశ్వాసాలకు చెందిన ఆలయాలు 8 వ తారీకు నుండి ఓపెన్ చేసుకునే విధంగా మార్గదర్శకాలు రిలీజ్ చేయడంతో జూన్ ఎనిమిదో తేదీ నుండి శ్రీవారి భక్తులకు దర్శనం నిమిత్తం శ్రీవారి దర్శనానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ సమయంలో టీటీడీ దర్శనం నిమిత్తం 14 గంటలలో రోజుకి ఏడు వేల మందికి మాత్రమే ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది.

IHG

శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లను ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది. అంతేకాకుండా దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా మాస్క్, చేతికి గ్లౌజులు అదేవిధంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలని, తప్పనిసరిగా ఈ నిబంధనలు పాటించాలి తెలిపింది. మొత్తం మీద రెండు నెలలపాటు శ్రీవారి భక్తులకు దర్శనం లేకపోవడంతో తాజాగా టీటీడీ మరియు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి భక్తుల నుండి సంతోషం వ్యక్తమవుతోంది. ఇదిలా ఉండగా లాక్ డౌన్ టైం లో శ్రీవారి లడ్డూ ప్రసాదం భక్తులకు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది. లడ్డూ ప్రసాదాన్ని పొందుకోవాలి అని అనుకునే వారి కోసం టీటీడీ వెబ్  సైట్ లో ఫోన్ నెంబర్లు అందుబాటులోకి తీసుకురావటం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: