లాక్ డౌన్ తర్వాత మొట్టమొదటి సారి ఏపీ సీఎం జగన్ రేపు ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో పాటు అందుబాటులో నెలకొన్న మరికొంతమంది కేంద్రమంత్రులతో బేటీ కాబోతున్నట్లు సమాచారం. లాక్ డౌన్ తర్వాత రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి సంప్రదింపులు చేయనున్నట్లు సమాచారం. అదేవిధంగా  హోంమంత్రి అమిత్ షా తో SEC, మండలి రద్దు వంటి విషయాల గురించి చర్చించే అవకాశం ఉంది. ఏపీ మండలిని రద్దు చేస్తూ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం ఇప్పటికే కేంద్రానికి పంపింది.

IHG

ఈ నేపథ్యంలో గత పార్లమెంటు సమావేశాల్లో మండలి రద్దు నిర్ణయాన్ని కి ఆమోదముద్ర వస్తదని భావించిన జగన్ సర్కార్ కరోనా ఎఫెక్టుతో సమావేశాలు జరిగే అవకాశం లేకపోవడంతో రాబోయే సమావేశాలలో ఆమోదముద్ర పొందే విధంగా అమిత్ షా తో జగన్ చర్చించినట్లు సమాచారం. చాలా వరకూ ముఖ్యమంత్రి హోదాలో నిధుల కోసం జగన్ ఢిల్లీ టూర్ ఉండబోతుందని పార్టీ నుండి అందుతున్న సమాచారం.

IHG

మరోపక్క ప్రభుత్వ వ్యవస్థలను మేనేజ్ చేసే విధంగా ప్రజాస్వామ్యం ఉండటంతో, న్యాయస్థానాలలో వరుస ఎదురు దెబ్బలు తగలడంతో ఈ విషయాన్ని జగన్... అమిత్ షాతో చర్చించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా చాలా నెలల తర్వాత జగన్ ఢిల్లీ టూర్ పైగా అమిత్ షాతో భేటీ అనేది తాజాగా ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో పెద్ద హాట్ టాపిక్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: