దేశంలో లాక్ డౌన్ విషయంలో ఎయిమ్స్‌ వైద్యులు గట్టిగా హెచ్చరికలు జారీ చేశారు. లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేయాలి అంటే దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పరీక్షలు జరగాలని సూచించారు. అప్పుడు పెద్ద ఎత్తున కరోనా వైరస్ పాజిటివ్ కేసులు బయటకు వస్తాయని ప్రభుత్వాలు అవగాహన ఉంటుందని తర్వాత లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తే బాగుంటుందని ఎయిమ్స్‌ వైద్యులు ఇటీవల తెలిపారు. తాజాగా ఎయిమ్స్‌ వైద్యులు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ విషయంలో దేశంలో అందరి కంటే ముందు జగన్ వైఖరి చాలా క్లియర్ కట్ గా ఉందని అర్థమవుతోంది.

 

దేశంలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా జగన్ సర్కార్ టెస్టుల విషయంలో రాష్ట్రంలో అధిక టెస్టులు నిర్వహిస్తోంది. ఈ టైంలో కేసులు బయటపడిన ప్రాంతాన్ని అదుపులోకి తీసుకుని మిగతా ప్రాంతాల్లో ఎటువంటి ఆంక్షలు, సడలింపులు లేకుండా వ్యవహరిస్తోంది. అయితే ఈ విషయంలో పాజిటివ్ కేసులు బయటపడుతున్న సమయంలో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నా టెస్టు సంఖ్యలు పెంచుకుంటూనే వెళ్లింది. ఇప్పుడు ఎయిమ్స్‌ అధ్యయనం చెబుతుంది కూడా అదే. అధిక సంఖ్యలో టెస్టులు నిర్వహిస్తేనే లాక్ డౌన్ పూర్తిగా ఎత్తివేసే చర్యలు తీసుకోవాలని సూచించింది.

 

ఈ లెక్కన చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు మూడు లక్షల 70 వేలకు పైగా కరోనా వైరస్ పరీక్షలు జగన్ సర్కార్ నిర్వహించింది. పదిలక్షల జనాభాకు సగటున 6,980 పరీక్షలు నిర్వహించినట్లు లెక్క. ఇది భారతదేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే మొదటి స్థానం. మొత్తంమీద చూసుకుంటే కరోనా వైరస్ ని ఎదుర్కొనే విషయంలో ముందు నుండి చాలా చాకచక్యంగా వ్యవహరిస్తున్న జగన్, లాక్ డౌన్ వైఖరిలో అందరి కంటే క్లియర్ కట్ గా ఉన్నాడు అని అర్థం అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: