జగన్ ఏడాది పరిపాలన పట్ల రాష్ట్రంలో ప్రజల్లో సానుకూల వాతావరణమే నెలకొని ఉంది అన్న టాక్ బలంగా వినబడుతోంది. విభజనతో నష్టపోయిన రాష్ట్రంలో ఒకపక్క సంక్షేమాన్ని మరోపక్క అభివృద్ధి చేసుకుంటూ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ పరిపాలన ప్రజల గడప దగ్గరికే అన్నట్టుగా వ్యవహరించడంతో రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు జగన్ వన్ ఇయర్ పాలనపై పాజిటివ్ గానే ఉండటం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల ఏడాది పరిపాలన అయిన సమయంలో 'మన పాలన మీ సూచన' కార్యక్రమంలో గ్రామ వాలంటీర్ల తో భేటీ అయిన సమయంలో గ్రామాల గురించి భవిష్యత్తులో  జగన్ చాలా శ్రద్ధ తీసుకోబోతున్నట్లు ఆయన మాట్లాడే విధానం బట్టి తెలుస్తోంది. వాస్తవంగా చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గ్రామాలలో ఏ పార్టీకి ఓటు బ్యాంకు క్యాడర్ గట్టిగా ఉంటుందో ఆ పార్టీ రాష్ట్ర పాలిటిక్స్ ని శాసించటం గ్యారెంటీ. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా గ్రామాలలో ఓటర్ యొక్క ఆలోచన విధానం బట్టి రిజల్ట్ డిసైడ్ అవుతోంది. ఇప్పుడు జగన్ గ్రామాలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టినట్లు అర్ధం అవ్వుతోంది. 

 

వాస్తవంగా చూస్తే ప్రతిపక్షం లో ఉన్న టైం లోనే జగన్ చేసిన పాదయాత్ర ఎక్కువ గ్రామాల మీదుగానే జరిగింది. దీంతో అధికారంలోకి రావటమే గ్రామాల పై ప్రత్యేకమైన దృష్టి పెడుతూ బెల్టుషాపులు లేకుండా చేస్తూ సరికొత్త నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు తాజాగా రాష్ట్రంలో అన్ని గ్రామాలలో వైయస్సార్ విలేజ్ క్లినిక్ లను ఏర్పాటు చేస్తున్నారు. త్వరలోనే వీటి ఏర్పాటుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అదే సమయంలో గ్రామం లోనే ఒక హాస్పిటల్ ఏర్పాటు చేయబోతున్నట్లు ఇటీవల జగన్ చెప్పుకొచ్చారు. దాదాపు వెయ్యికి పైగా రోగాలకు సంబంధించిన మందులు అక్కడే అందుబాటులో ఉండబోతున్నట్లు తెలిపారు. అంతేకాకుండా గ్రామంలోని ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాల, సెక్రటరియేట్ ఇలా అన్నీ ఒక చోట ఉంటే గ్రామం చాలా అభివృద్ధి చెందుతుందని ఇటీవల సీఎం జగన్ 'మన పాలన మీ సూచన' కార్యక్రమంలో గ్రామ ప్రజలకు సంబంధించి అనేక గుడ్ న్యూస్ లు చెప్పుకొచ్చారు.

 

దీంతో జగన్ ప్రకటనలపై ఏపీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ ప్రజలలో వారి ఆలోచనల్లో మార్పు వచ్చినట్లు ఏది అవసరమో అంత గ్రామం లో ఉంటే ఇంకా బయటికి వెళ్ళే పని లేకుండా జగన్ నిర్ణయాలు బాగున్నాయని ఆయన వైపు అడుగులు వేస్తున్నారట. రైతుల విత్తనాలకు సంబంధించి అదేవిధంగా గ్రామ సెక్రటేరియట్ ఇలా మొత్తం గ్రామంలో ఏది అవసరమో అని అందుబాటులో ఉండే విధంగా జగన్ తీసుకున్న నిర్ణయాల పట్ల రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ ప్రజలు బాగా ఆకర్షించబడుతున్నారట. చాలా వరకు మాపై ఉన్న భారాన్ని జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల తగ్గాయని గ్రామ ప్రజలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: