సాధారణంగా మనకు పురావస్తు శాస్త్రవేత్తలు ఆ కాలం నాటి వస్తువులు.. ఇతర విషయాల గురించి చెబుతుంటే ఎంతో ఆసక్తి కలుగుతుంది.  పాత తరం వస్తువులు మనకు ఎప్పుడైనా కొత్తదనంగా ఉంటుంది.  ఒకప్పుడు ఫోటోలు అంటే స్టూడియోకి వెళ్లేవారు.. కానీ ఇప్పుడు టెక్నాలజీ పూర్తిగా మారిపోయింది.. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంది.. హై క్వాలిటీ ఫోటోలు మన సెల్ ఫోన్ ద్వారా తీసుకుంటున్నాం... అవసరం అంటే క్షణాల్లో ప్రింట్ ఇచ్చుకుంటున్నాం.  కానీ ఒకప్పుడు ఫోటోలు తీయలంటే రీల్ ఉండేది.. దాన్ని డెవలప్ చేసి తర్వాత ఫోటోలు ప్రింట్ చేసేవారు.  తాజాగా ఫ్రాన్స్ దేశం పారిస్ న‌గ‌రానికి చెందిన మాథ్యూ స్టెర్న్ అనే ఫొటోగ్రాఫ‌ర్‌కు కూడా ఇలాంటి అనుభ‌వ‌మే ఎదురైంది.  

 

 

మాథ్యూ స్టెర్న్ కుటుంబానికి సంబంధించిన ఒక పాత‌కాలం నాటి ఇంట్లో ఇటీవ‌ల ఆయ‌న‌కు ఒక చిన్న‌పెట్టె క‌నిపించింది. అందులో ల‌భ్య‌మైన వ‌స్తువుల‌ను బ‌ట్టి ఆ పెట్టె 1900 సంవ‌త్స‌రం నాటి చిన్నారి బాలిక‌కు సంబంధించిన‌ది తెలిసింది.  ఆ పెట్టెలో నాటి చిన్న ‌పిల్ల‌ల‌కు సంబంధించిన ఆట వ‌స్తువుల‌తోపాటు పిల్లి, కుక్క బొమ్మ‌ల పేప‌ర్ క‌టౌట్‌లు, పాతకాల‌పు నాణెం, 120 ఏండ్ల క్రితం నాటి రెండు గ్లాస్ ప్లేట్ ఫొటో నెగెటివ్స్ ఉన్నాయి. అంతే స్వతహాగా మనోడు మంచి ఫోటో గ్రాఫర్ దాంతో ఆయనకు మంచి సంతోషకరమైన సంపద దొరికినట్లు ఫీల్ అయ్యారు.

 

ఆ పెట్టెలో ల‌భించిన గ్లాస్ ప్లేటెడ్ నెగెటివ్స్‌ను ఫొటోగ్ర‌ఫీ, ఫిల్మ్ మేకింగ్‌కు సంబంధించిన ఆధునిక సాంకేతిక ప‌ద్ధ‌తులు, ప‌రిక‌రాల‌ను ఉప‌యోగించి డెవ‌ల‌ప్ చేశారు. ఆ ప్రాసెస్ మొత్తాన్ని వీడియో తీశారు. ఆరు నిమిషాల నిడివిగ‌ల ఈ వీడియోను యూట్యూబ్‌లో పోస్ట్‌చేశారు. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దాదాపు 9 ల‌క్ష‌ల వ్యూస్ వ‌చ్చాయి. ఏది ఏమైనా పాత తరం సంపద మనకు దొరికితే నిజంగా అదృష్టంగానే భావిస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: