తెలంగాణ రాష్ట్ర పోలీసులు దేశంలోనే అత్యుత్తమ సర్వీస్ చేస్తున్న నెంబర్వన్ పోలీసింగ్ అనే బిరుదులను ప్రతి ప్రశంసలను అందుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయి ఇండిపెండెంట్ రాష్ట్రంగా ఏర్పడిన అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే విధానం అవలంబించ బడింది. ఫ్రెండ్లీ పోలీస్ కారణంగా ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహ భావం పెరిగిపోయింది. తెలంగాణలోని పోలీసులు ముఖ్యంగా హైదరాబాద్ పోలీసులు టెక్నాలజీని చాలా చక్కగా సద్వినియోగం చేసుకుంటూ నేరగాళ్లను పట్టుకుంటున్నారు. అలాగే ఎటువంటి కొత్త నేరాలు జరగకుండా రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉంచేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. 


భారతదేశంలో మహిళలకు ఏ రాష్ట్ర పోలీసులు కల్పించని భద్రతను తెలంగాణ పోలీసులు కల్పిస్తున్నారు. 2014 అక్టోబర్ 24వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో మహిళల భద్రత రక్షణ కొరకై షీ టీమ్స్ ప్రారంభించారు. ఇన్స్పెక్టర్ జనరల్(IG) స్వాతి లక్రా షీ టీమ్స్ కి నేతృత్వం వహిస్తున్నారు. ఈ సంవత్సరం జనవరిలో వాట్సాప్ హెల్ప్ లైన్ నెంబర్ (9441669988)ని ఆమె లాంచ్ చేసారు. లైంగిక వేధింపులు, గృహ హింస, అసభ్యకరంగా ప్రవర్తించిన పోకిరి లను పట్టించడానికి ఏ మహిళ అయినా వాట్సాప్ మెసేజ్ పంపిస్తే స్థానిక షీ టీం పోలీసులు వెంటనే బాధితులను చేరుకొని నిందితులను అరెస్టు చేస్తారు. అత్యాచారాలకు, మగ మృగాళ్ల మోసాలకు బలి అయిన వారికి అండగా నిలిచేందుకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో భరోసా కేంద్రాలు ఉన్నాయి. 


ప్రస్తుతం డిజిపి బాధ్యతలు నిర్వర్తిస్తున్న... గతంలో హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన మహేందర్ రెడ్డి నేనుసైతం అనే ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా అది ప్రజాదరణ విపరీతంగా పొందింది. తెలంగాణ ప్రభుత్వం అనేక ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయగా... ప్రజలు కూడా తమ సొంతం డబ్బులతో వారి వారి ఇళ్ళ ముందు షాపుల ముందు సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి నేరగాళ్లను పట్టించేందుకు పోలీసులకు సహాయ పడుతున్నారు. నిజానికి ఎన్నో నేరాలు సీసీ కెమెరాల వలన పరిష్కరించబడ్డాయి. 


ఐటీ కారిడార్ లో మహిళల భద్రత కోసం సైబర్ సెక్యూరిటీ, సీసీ కెమెరాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. ఐటీ, సాఫ్ట్ వేర్ రంగాలలో సెక్స్ వల్ హరాస్మెంట్ కి చెక్ పెట్టేందుకు ఆయా సంస్థలలో అంతర్గత ఫిర్యాదుల కమిటీని ఏర్పాటు చేసి తమ వినూత్నమైన ఆలోచనతో అందరి ఉద్యోగస్తుల చేత వావ్ అనిపించుకున్నారు. ఉమెన్స్ ఆన్ వీల్స్( ఆగమేఘాలపై వచ్చే మహిళలు) అనే పేరుతో షీ టీమ్స్ ఆపదలో ఉన్న ఏ మహిళ వద్దకు అయినా క్షణాల్లో చేరి పోయే విధానాన్ని తెలంగాణ పోలీసులు అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి ఫైన్ విధించేందుకు వెహికల్ నెంబర్ ప్లేట్ రికగ్నైజేషన్ పద్ధతిని ప్రవేశపెట్టి వాహనదారులని రూల్స్ పాటించేలా చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: