చైనాలో కమ్యూనిస్టు ప్రభుత్వం వచ్చిన తర్వాత... కొన్ని కీలక  నిర్ణయాలు తీసుకుని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో 1958 -62 వరకు రెండో పంచవర్ష ప్రణాళికలో భాగంగా.... దేశవ్యాప్తంగా ఉన్న ఈగలు దోమలు పిచ్చుకలను సమూలంగా నిర్మూలించాలని లక్ష్యంతో... ముందుకు సాగింది విజయం సాధించింది.. కానీ ఆ తర్వాత చైనా ముందు పెద్ద సవాలే నిలిచింది . అదే మిడతల దండు . భారీ మొత్తంలో మిడతలు చైనా పంటల పై దాడి చేయడంతో... అక్కడి పంటలు మొత్తం దెబ్బతిన్నాయి. ఒకవేళ పిచ్చుకలు ఉండి ఉంటే మిడతలను  వెంబడించి మరి తినేవి  కానీ అవి  లేకపోవడం కారణంగా అక్కడి పంటలకు  రక్షణ లేకుండా అయిపోయింది. ఈ నేపథ్యంలో చైనా ప్రభుత్వం మరోసారి ముందడుగు వేసి బాతుల పెంపకానికి ముందుకు వచ్చింది.

 

 చైనా దేశంలో భారీ మొత్తంలో బాతుల పెంపకం చేపట్టింది చైన. ఇక ఈ బాతులు మిడతలకు  సంబంధించిన లార్వాలను ఎగర లేని పిల్లలను కూడా హాయిగా ఆరగిస్తూ ఉంటాయి. నోటికందిన పెద్ద మిడతలను కూడా బాగా తింటూ ఉంటాయి . మిడతల దండు దేశంలోకి పంటల పై దాడి  చేయడానికి ఎప్పుడు  వచ్చిన  చైనా ఇదే వ్యూహాన్ని అమలు చేస్తూ వచ్చేది. అయితే ఇప్పుడు మిడతల దండు భారతదేశానికి కూడా పెద్ద సవాలుగా మారిన విషయం తెలిసిందే. ఈ మిడతల దండు  భారత్లోని అన్ని రాష్ట్రాల పైకి దూసుకొస్తోంది. భారీగా పంట నష్టాన్ని కలిగిస్తుంది. ఈ మిడతల దండు ని  అడ్డుకునేందుకు రసాయనాల ద్వారా అధికారులు కూడా సిద్ధంగా ఉంటున్నారు.  

 

 

 అధికారులు విడుదల దండు వస్తుంది అన్నది ముందుగానే గ్రహించి రాష్ట్ర సరిహద్దుల వద్ద రసాయనాలు... డిజె సౌండ్ తో సిద్ధం గా ఉంటున్నారు. రైతు లు కూడా భారీగా సౌండ్ చేస్తూ ముడతలను పంట లపైకి రాకుండా  ప్రయత్నం చేస్తున్నా. ఏదేమైనా ప్రస్తుతం కరోనా వైరస్ లాంటి క్లిష్టపరిస్థితుల్లో భారత ప్రభుత్వం ముందు మిడతల దండు అనే మరో ప్రమాదం కూడా ఉన్న విషయం తెలిసిందే. దీంతో దేశవ్యాప్తంగా అధికారులందరూ అప్రమత్తమై మిడతల దండులా ఎదుర్కొనేందుకు సిద్ధపడుతుండగా... అటు దేశ వ్యాప్తంగా ఉన్న రైతులు మాత్రం మిడతల దండు ఎక్కడ తమ పంటల మీద దాడిచేసి నష్టాన్ని కలిగిస్తుందోనని  భయాందోళన లోనే బతుకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: